road accident in Kurnool : అతి వేగం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. కర్నూలు జిల్లా సింగవరం నిర్జుర్ గ్రామాల మధ్య ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. టిప్పర్ వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు.. అదుపుతప్పి టిప్పర్ టైర్ కింద పడిపోయారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మృతులు ఇద్దరిని కొంతలపాడు గ్రామానికి చెందిన బావ బామ్మర్దులుగా గుర్తించారు.
కాగా, స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం హాస్పటల్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also… Minor girl suicide : సెల్‌ఫోన్ విషయంలో స్నేహితులతో గొడవ.. తల్లి మందలిస్తుందని బాలిక ఆత్మహత్య