Hyderabad Banjara Hills: హైదరాబాద్ నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. నగరంలోని బంజారాహిల్స్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు యెమెన్ దేశానికి చెందిన వారిగా గుర్తించారు. వీరి వద్ద నుంచి కొకైన్, చరస్, ఎండీఎంఏ వంటి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఓ ఇంటిపై గురువారం ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
17 గ్రాముల కొకైన్, 8 గ్రాముల ఎండీఎంఏ, 73 ఎస్టకి పిల్స్, 15 గ్రాముల చరస్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వక్తులు యెమెన్ దేశానికి చెందిన అబ్దురబాబు, సొలమన్‌గా గుర్తించారు. వారు బెంగళూరు, ముంబై నుండి డ్రగ్స్ తెచ్చి హైదరాబాదులో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్క గ్రామ్ కొకైన్ 8 వేలకు అమ్ముతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: