Secunderabad: ఛార్జింగ్‌ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్.. క్షణాల్లో కాలి బూడిదైన ఎలక్ర్టిక్‌ బస్సు.. ఎన్ని కోట్ల నష్టమంటే..

|

Feb 23, 2022 | 5:59 AM

Fire Accident: సికింద్రాబాద్ (secunderabad) కంటోన్మెంట్ ఆర్టీసీ డిపోలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్‌కు (electric bus) ఛార్జింగ్ పెడుతుండగా ఎమర్జెన్సీ స్విచ్‌ లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Secunderabad: ఛార్జింగ్‌ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్.. క్షణాల్లో కాలి బూడిదైన ఎలక్ర్టిక్‌ బస్సు.. ఎన్ని కోట్ల నష్టమంటే..
Follow us on

Fire Accident: సికింద్రాబాద్ (secunderabad) కంటోన్మెంట్ ఆర్టీసీ డిపోలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్‌కు (electric bus) ఛార్జింగ్ పెడుతుండగా ఎమర్జెన్సీ స్విచ్‌ లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో డిపో సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సుమారు గంటసేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా అగ్నిప్రమాదంలో కాలిపోయిన ఎలక్ర్టిక్‌ బస్సు విలువ సుమారు రూ.3 కోట్లు ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. సిబ్బంది వెంటనే అప్రమత్తమై పక్కనే ఉన్న మరికొన్ని బస్‌లను దూరంగా తరలించారని, దీంతో పెను ప్రమాదం తప్పినట్టైందని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.

శబ్ధ, వాయు కాలుష్యాలకు నివారించే లక్యంతో తెలంగాణ ఆర్టీసీ 2019లో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల నుంచి ప్రయాణికులను శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరవేసేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు.ఈ ఎలక్ర్టిక్‌ బస్సులను మియాపూర్-2, కంటోన్మెంట్ డిపోలకు కేటాయించారు. మియాపూర్ డిపో బస్సులు బీహెచ్‌‌ఈఎల్ నుంచి, కంటోన్మెంట్ డిపో బస్సులు జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి.

Also Read: RUSSIAN INVASION: పుతిన్ ప్రకటనపై అమెరికా, యుకే ఆగ్రహం.. రష్యాపై ఆంక్షల వర్షం.. తప్పేనా ముప్పు?

Afghanistan-India: తీవ్ర ఆహార సంక్షోభంలో ఆఫ్గన్‌ ప్రజలు.. పాక్‌ మీదుగా 2,500 టన్నుల గోధుమలను పంపిణీ చేసిన భారత్‌!

Summer Diet: కాలం మారుతోంది.. ఆహారంలో ఈ మార్పులు తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే..