లోయలో పడిన పెళ్లి బస్సు !! 10 మంది మృతి !! వీడియో
ఉత్తరాఖండ్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. వివాహానికి వెళ్లి తిరిగి వస్తున్న పెళ్లి బృందం బస్సు లోయలో పడిపోయింది.. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు.
ఉత్తరాఖండ్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. వివాహానికి వెళ్లి తిరిగి వస్తున్న పెళ్లి బృందం బస్సు లోయలో పడిపోయింది.. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. చంపావత్ జిల్లాలోని సుఖిదాంగ్-దాందమినార్ రహదారి మీదుగా వెళ్తున్న పెళ్లి బృందం వివాహానికి వెళ్లి, తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొని క్షతగాత్రులను చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. పంచముఖి ధర్మశాలకు చెందిన లక్ష్మణ్ సింగ్ కుమారుడు మనోజ్ సింగ్ పెళ్లి వేడుకకు హాజరై ఫిబ్రవరి 21 అర్ధరాత్రి తర్వాత ఓ వాహనంలో తిరిగి తమ సొంత ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. ఫిబ్రవరి 22 తెల్లవారుజామున 3 గంటన 20 నిమిషాల సమయంలో వాహనం అదుపు తప్పి, రహదారి పక్కన ఉన్న లోయలోకి దూసుకెళ్లిందని తెలిపారు. ఈ ఘటనలో మరికొందరికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

