Etela Rajendar: ఈటల రాజేందర్ ఇన్ ట్రబుల్.. ఫ్యామిలీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుకు డీజీపీకి ఫిర్యాదు

|

Jul 29, 2021 | 6:19 PM

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ బావ మరిది కొండవీటి ముధుసూదన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు TSGCC చైర్మన్ ధారవత్ మోహన్ గాంధీ.

Etela Rajendar: ఈటల రాజేందర్ ఇన్ ట్రబుల్.. ఫ్యామిలీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుకు డీజీపీకి ఫిర్యాదు
Case Against Etela Family
Follow us on

Complaint Against Etela Family: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ బావ మరిది కొండవీటి ముధుసూదన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు TSGCC చైర్మన్ ధారవత్ మోహన్ గాంధీ. కొండవీటి ముధుసూదన్ రెడ్డి.. దళితలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీని కోరారు. ఈటల పౌల్ట్రీ పార్టనర్‌తో ముధుసూదన్ రెడ్డి చేసిన ఫోన్ వాట్సప్ చాట్‌లో దళితులను కించపరిచేలా ఉన్న వ్యాఖ్యలను ఖండిస్తూ డీజీపీకి TSGCC చైర్మన్ ధారవత్ మోహన్ గాంధీ ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ధారవత్ మోహన్ గాంధీ మాట్లాడుతూ.. దళితులను అసభ్యంగా తిడుతూ మెసేజ్ చేసిన ముధుసూదన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈటల బావమరిది అయిన మధుసూదన్ రెడ్డి దళితులను కించ పర్చే విధంగా సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు. ఈ వివాదంపై ఈటల రాజేందర్, ఈటల బామ్మర్ది క్షమాపణ చెప్పకపోతే దళిత వాడలకు ఓటు అడగడానికి వస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈటల కుటుంబంపై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టమని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దళిత బంధు స్కీమ్‌తో ఒడిపోతామని భయంతో విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని మోహన్ గాంధీ మండిపడ్డారు. ఈటల రాజేందర్‌తో పాటు ఆయన బావమరిది ముధుసూదన్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే దళిత వాడలకు ఓటు అడగడానికి వస్తే అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.

Read Also…. NEET Exam Centre: రాజమండ్రిలో నీట్ పరీక్ష కేంద్రం ఏర్పాటుకు వైసీపీ ఎంపీల వినతి.. ఉభయగోదావరి జిల్లాల విద్యార్థులకు ఊరట దక్కేనా.?