AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నమ్మకమే బాలిక కొంప ముంచింది.. స్నేహితులే కామ పిశాచులయ్యారు!

బాలికతో స్నేహం నటించారు… ఆమె చనువును అవకాశంగా తీసుకుని పక్కాప్లాన్‌తో కిడ్నాప్‌ చేశారు. రాత్రంగా స్కూటీపై ఎక్కించుకుని 30 కిలో మీటర్లు తిప్పి.. మూడుసార్లు అత్యాచారం చేశారు. ఆమెకు బీరుతాగించి.. యువతి పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్థించారు. చివరకు కోరిక తీర్చుకుని ఆ బాలికను అర్థరాత్రి నడిరోడ్డుపై వదిలేసి పరారయ్యారు. కలకలం రేపిన ఈ దారుణ సంఘటన ప్రకాశంజిల్లా కొత్తపట్నంలో ఈ నెల 23వ తేదిన జరిగింది. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఫోక్సో, […]

నమ్మకమే బాలిక కొంప ముంచింది.. స్నేహితులే కామ పిశాచులయ్యారు!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 28, 2020 | 2:57 PM

Share

బాలికతో స్నేహం నటించారు… ఆమె చనువును అవకాశంగా తీసుకుని పక్కాప్లాన్‌తో కిడ్నాప్‌ చేశారు. రాత్రంగా స్కూటీపై ఎక్కించుకుని 30 కిలో మీటర్లు తిప్పి.. మూడుసార్లు అత్యాచారం చేశారు. ఆమెకు బీరుతాగించి.. యువతి పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్థించారు. చివరకు కోరిక తీర్చుకుని ఆ బాలికను అర్థరాత్రి నడిరోడ్డుపై వదిలేసి పరారయ్యారు. కలకలం రేపిన ఈ దారుణ సంఘటన ప్రకాశంజిల్లా కొత్తపట్నంలో ఈ నెల 23వ తేదిన జరిగింది. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.

వివారాల్లోకి వెళ్తే.. ప్రకాశంజిల్లా కొత్తపట్నంలో ఈనెల 23 తేదిన రాత్రి 15 ఏళ్ళ బాలికను ఇద్దరు యువకులు స్కూటీపై కిడ్నాప్‌ చేశారు. బాలికతో గతంలో ఉన్న పరిచయం నేపథ్యంలో నమ్మకంగా స్కూటీపై ఎక్కించుకుని కొత్తపట్నం శివారు ప్రాంతానికి తీసుకెళ్ళారు. అక్కడ ఆమెపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రతిఘటిస్తున్నా వినకుండా బెదిరించి మరీ అఘాయిత్యం చేశారు. అంతటితో ఆగకుండా అదే స్కూటీపై ఆమెను 30 కిలో మీటర్లు తిప్పి.. ముప్పు తిప్పలు పెట్టారు. వలసపాలెం గ్రామ శివారులో ఒకసారి, సూరారెడ్డిపాలెం రైలు పట్టాల దగ్గర ఒకసారి వరుసగా అత్యాచారం చేశారు.

అనంతరం ఆమెను ఒంగోలులోని గోపాలనగర్‌కు తీసుకొచ్చి ఓ ఇంట్లో ఉంచారు. అక్కడ ఆమెకు బలవంతంగా బీరు తాగించి మరోసారి అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను అర్ధరాత్రి బయటకు తీసుకొచ్చి ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో వదిలిపారిపోయారు. జరిగిన దారుణాన్ని బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు అలర్ట్‌ అయ్యారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దారుణానికి పాల్పడింది ఒంగోలుకు చెందిన 28 ఏళ్ళ నటరాజు వెంకటేశ్వర్లు, 17 ఏళ్ళ మైనర్‌ మాచవరకు దేవేద్రగా గుర్తించారు. బాలిక దళిత వర్గానికి చెందడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌తో పాటు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇద్దరి నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. కాగా వీరిలో ఒక నిందితుడు మైనర్. బాలికతో ఉన్న పరిచయం నేపథ్యంలో నమ్మకంగా వ్యవహరించి ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లి కిడ్నాప్‌, అత్యాచారం చేసిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

Follow Us
మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న మాజీ మంత్రి మల్లారెడ్డి!
మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న మాజీ మంత్రి మల్లారెడ్డి!
బెస్ట్‌ ట్రిక్స్‌..ఇలా చేశారంటే వంట గ్యాస్‌ను భారీగా ఆదా చేయొచ్చు
బెస్ట్‌ ట్రిక్స్‌..ఇలా చేశారంటే వంట గ్యాస్‌ను భారీగా ఆదా చేయొచ్చు
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా.. ఈ దేశాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసా
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా.. ఈ దేశాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసా
చెత్త అని తీసిపారేయకండి! సరిగ్గా వాడితే డబ్బులే డబ్బులు
చెత్త అని తీసిపారేయకండి! సరిగ్గా వాడితే డబ్బులే డబ్బులు
పీఎం కిసాన్ మీకు వస్తుందా..? రాదా..? ఇలా తెలుసుకోండి
పీఎం కిసాన్ మీకు వస్తుందా..? రాదా..? ఇలా తెలుసుకోండి
బాక్సింగ్ రింగ్‌లోకి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఫొటోస్ వైరల్
బాక్సింగ్ రింగ్‌లోకి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఫొటోస్ వైరల్
బుధవారం పుట్టినవారు మనీ మైండెడ్..! వీరు ఏ రంగంలో రాణిస్తారంటే..?
బుధవారం పుట్టినవారు మనీ మైండెడ్..! వీరు ఏ రంగంలో రాణిస్తారంటే..?
బెండకాయ తింటున్నారా.. జర జాగ్రత్త...
బెండకాయ తింటున్నారా.. జర జాగ్రత్త...
యుద్ధంలో భారీ నష్టం.. ఆఫ్ఘన్ ముందు మోకరిల్లిన పాక్..!
యుద్ధంలో భారీ నష్టం.. ఆఫ్ఘన్ ముందు మోకరిల్లిన పాక్..!
కేవలం రూ.800తో కోటీశ్వరులు అవ్వొచ్చు.. కియోసాకి సిల్వర్ సీక్రెట్
కేవలం రూ.800తో కోటీశ్వరులు అవ్వొచ్చు.. కియోసాకి సిల్వర్ సీక్రెట్