Yadadri Bhuvanagiri Accident: తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భువనగిరి మండలం హన్మాపురం బాచ్పాన్ వద్ద వేగంగా దూసుకొచ్చిన డీసీఎం వ్యాన్.. అదుపుతప్పి స్కూటీని ఢీకొట్టింది. దీంతో స్కూటీపై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి (Bhuvanagiri) పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకుల మృతి..
ఇదిలాఉంటే.. సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని ముకుందాపురం స్టేజి వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు మృతిచెందారు. ముకుందాపురం వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తండ్రి కొడుకులు మృతి చెందగా, తల్లికి తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..