AP Crime News: ఏటీఎంలో చోరి కేసులో దొరికారు.. విచార‌ణ‌లో పోలీసుల మైండ్ బ్లాంక్

|

Jun 20, 2021 | 11:59 AM

5 హత్యలు..10 చైన్‌ స్నాచింగ్‌లు, 5 చోరీలు చేశారు. కానీ, దొరికింది మాత్రం ఏటీఎం దొంగతనం కేసులో... పెనమలూరు ఏటీఎం చోరీ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

AP Crime News: ఏటీఎంలో చోరి కేసులో దొరికారు.. విచార‌ణ‌లో పోలీసుల మైండ్ బ్లాంక్
Murderers Held
Follow us on

5 హత్యలు..10 చైన్‌ స్నాచింగ్‌లు, 5 చోరీలు చేశారు. కానీ, దొరికింది మాత్రం ఏటీఎం దొంగతనం కేసులో… పెనమలూరు ఏటీఎం చోరీ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు బెజవాడ పోలీసులు.  పట్టుబడిన ఏటీఎం దొంగలను విచారించగా నరహంతకులు అని తెలిసి పోలీసులే షాక్‌ అయ్యారు. ఏకంగా ఐదు హత్యలతో తమకు సంబంధం ఉందని, 10 చైన్‌ స్నాచింగ్‌లు, 5 చోరీలు చేసినట్టు ఒప్పుకున్నారు పట్టుబడ్డ నిందితులు. యూట్యూబ్‌ నేర కథనాల ద్వారా పథకాలు రచిస్తున్నట్లు తేల్చారు. ఒంటరి మహిళలు, వృద్ధులే టార్గెట్‌గా నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు నిర్దారించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం ముఠా సభ్యులను రిమాండ్‌కు తరలించారు.

గతేడాది కంచికచర్లలో సంచలనం సృష్టించిన వృద్ధ దంపతుల కేసులో చిక్కుముడి వీడింది. పెనమలూరులో ఏటీఎం దొంగతనం చేసి పట్టుబడిన ముగ్గురు నిందితుల వేలిముద్రల ఆధారంగా కంచికచర్లలో వృద్ధ దంపతులను వారే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. డిసెంబర్ 25 రాత్రి బండారుపల్లి నాగేశ్వరరావు అలియాస్ నాగులు, భార్య ప్రమీలారాణి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేసేందుకు వచ్చి హత్య చేసి ఉంటారని పోలీసులు భావించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. ఇంటి వెనుక ఉన్న మెస్ డోర్ తెరచి దొంగలు లోపలికి ప్రవేశించారని అని పోలీసులు గుర్తించారు. పెనమలూరులోని ఏటీఎంలో చోరికి పాల్పడిన వారి వేలిముద్రల ఆధారంగా.. వారే ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు.

Also Read: ఏపీ పోలీసుల విజ్ఞప్తిని బేఖాతరు చేస్తున్న ట్విట్టర్.. నోటీసులు పంపేందుకు ప్లాన్ చేస్తున్న అధికారులు

సినీ నటి కేసులో మాజీ మంత్రి అరెస్ట్..! పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశారని ఆరోపణలు..