ఏపీలో రెచ్చిపోయిన సంక్రాంతి దొంగలు

| Edited By:

Jan 16, 2020 | 6:22 PM

సంక్రాంతి వేళ ఏపీలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్‌గా చోరీలకు పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తలుపులు, తాళాలు పగులగొట్టి దొరికినకాడికి దోచుకెళ్లారు. బంగారు, వెండి ఆభరణాలతో పాటుగా వాహనాలు సైతం వదలకుండా దుండగులు చేతివాటం ప్రదర్శించారు. విజయవాడ, కర్నూలు జిల్లాలో వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కర్నూలు జిల్లాలో దొంగలు వరుస చోరీలతో హడలెత్తించారు. పెద్దకడబూరు మండలం బసలదొడ్డిలో అర్ధరాత్రి వేళ దొంగలు ఐదు ఇళ్లలో లూటీకి పాల్పడ్డారు. సంక్రాంతి […]

ఏపీలో రెచ్చిపోయిన సంక్రాంతి దొంగలు
Follow us on

సంక్రాంతి వేళ ఏపీలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్‌గా చోరీలకు పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తలుపులు, తాళాలు పగులగొట్టి దొరికినకాడికి దోచుకెళ్లారు. బంగారు, వెండి ఆభరణాలతో పాటుగా వాహనాలు సైతం వదలకుండా దుండగులు చేతివాటం ప్రదర్శించారు. విజయవాడ, కర్నూలు జిల్లాలో వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

కర్నూలు జిల్లాలో దొంగలు వరుస చోరీలతో హడలెత్తించారు. పెద్దకడబూరు మండలం బసలదొడ్డిలో అర్ధరాత్రి వేళ దొంగలు ఐదు ఇళ్లలో లూటీకి పాల్పడ్డారు. సంక్రాంతి పండగకు కుటుంబ సభ్యులు ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఊరికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దుండగులు అర్ధరాత్రి ఇళ్లు తాళాలు పగులగొట్టి దొరికినంత దోచుకెళ్లారు. 7 లక్షల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలు, అరకిలో వరకు వెండి ఆర్నమెంట్స్‌, రెండు బైకులు అపహరించారు గుర్తు తెలియని వ్యక్తులు. గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎవరైనా తెలిసిన వారు చేశారా..? లేదా దోపిడీ దొంగల పనేనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అటు, కృష్ణా జిల్లా ఉయ్యూరులోనూ అర్ధరాత్రి ఓ ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌజ్‌ సమీపంలో నివసిస్తున్న టీవీఎస్‌ షోరూమ్‌ యజమాని రత్నం ఇంట్లో దొంగలు తెగబడ్డారు. ఈ నెల 9న రత్నం శబరిమలకు వెళ్లారు. అతని తల్లి, చెల్లెలు సంక్రాంతి పండగ సందర్బంగా బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన దోపిడీ దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి వేళ ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు ఇంట్లోని వస్తువులన్ని చిందరవందర చేశారు. బీరువాలో ఉన్న సుమారు 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 50 లక్షల నగదు దోచుకువెళ్లారు. రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్‌ టీమ్‌, డాగ్ స్క్వాడ్‌తో దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.