Thieves Drill Whole to Bank: దేశ రాజధాని ఢిల్లీలో బ్యాంకుకే కన్నం వేశారు దుండగులు. షాహదరా ప్రాంతంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో ఆదివారం దోపిడీ జరిగింది. దుండగులు బ్యాంక్‌లోని రూ.55 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం వచ్చేసరికి బ్యాంకుకు రంధ్రం ఉండటం గమనించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగలు చాకచక్యంగా దాని పక్కన నిర్మాణంలో ఉన్న భవనం గోడలను పగలగొట్టి బ్యాంకులోకి ప్రవేశించారని పోలీసులు తెలిపారు..
కాగా, ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. శుక్రవారం, శనివారం డిపాజిటర్ల నుంచి బ్యాంక్ వసూలు చేసిన నగదుతో దుండగులు దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అయితే బ్యాంకు ఇతర భాగంలో ఉన్న అన్ని లాకర్లు, ఆభరణాలు సురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, బ్యాంకును ఆనుకుని ఉన్న ప్రాంతంలో ఇటీవల ఓ భవన నిర్మాణం జరుగుతుంది. ఇది అదునుగా భావించిన దుండగులు భవనం గోడ గుండా బ్యాంకులోకి రావడానికి దొంగలు రంధ్రం చేసినట్లు పోలీసులు గుర్తించారు. బ్యాంకు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీసీటివి కెమెరా దొంగలలో ఒకరిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ దొంగతనంలో ఎంతమంది పాల్గొన్నారో ఇంకా పూర్తిగా నిర్ధారించలేదని పోలీసులు తెలిపారు. గుర్తించిన ఒకరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ నేరానికి పాల్పడిన వారందరినీ గుర్తించి అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలతో గాలింపుచర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
బ్యాంక్ దోపిడీ జరిగినట్లు వార్తలు వ్యాపించడంతో, ఆందోళన గురైన కస్టమర్లు బ్యాంకు ముందు పెద్ద వరుసలో బారులు తీరారు. తమ సొమ్ము తిరిగి తీసుకునేందుకు బ్యాంక్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. “మా బంధువులు చాలా మంది ఈ శాఖలో బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి. వారు ఉదయం ఇక్కడకు వచ్చి దొంగతనం గురించి తెలుసుకుని మాకు సమాచారం ఇచ్చారు. మాకు ఇక్కడ కూడా ఖాతాలు ఉన్నాయి. మా వ్యాపారంతో సంబంధం ఉన్న ఖాతాలు ఉన్నాయి. ఆందోళన చెందుతున్నాము. మాకు మేనేజ్‌మెంట్ వివరాలు ఇవ్వలేదు “అని ఒక కస్టమర్ వాపోయాడు.
Read Also.. Woman forced to convert: మరోసారి వెలుగులోకి మతమార్పిడి.. ప్రేమ పేరుతో మోసం.. నిఖా ఏర్పాటుతో అసలు నిజం..!