ATM Robbery: తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో నలుగురు దుండగులు ఓ ఏటీఎంను కొల్లగొట్టేందుకు ప్రయత్నించి విఫలయత్నం అయ్యారు. సమయానికి పోలీసుల పెట్రోలింగ్ వాహనం రావడంతో.. దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ చోరీ ఘటన మంచిర్యాల (mancherial distric) జిల్లాలోని జైపూర్ మండలం కేంద్రంలోని ఎస్‌బీఐ (SBI) ఏటీఎంలో జరిగింది. తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఏటీఎం (ATM) సెంటర్లోకి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. అనంతరం గ్యాస్ కట్టర్ సాయంతో ఏటీఎం మిషన్‌ను కట్ చేశారు. సరిగ్గా ఇదే సమయంలో పెట్రోలింగ్ వాహనం రావడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఏటీఎంలో 13 లక్షలకు పైగా నగదు సేఫ్‌గా ఉందని తెలిపిన బ్యాంక్ మేనేజర్ వెల్లడించారు.
సమాచారం అందుకున్న జైపూర్ ఏసీపీ నరేందర్ , శ్రీరాంపూర్ సీఐ రాజు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీమ్ సాయంతో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఏటీఎంలో నగదు అలానే ఉందని.. సమయానికి పెట్రోలింగ్ వాహనం రావడంతో దుండగులు పరారయ్యారని ఏసీపీ నరేందర్ తెలిపారు. కాగా.. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది.
సీసీ టీవీ ఫుటేజ్ సాయంతో దుండగుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ వీడియోను సైతం పోలీసులు విడుదల చేశారు.
Also Read: