ఆమెకు పెళ్లైంది.. ప్రశాతంగా కాపురం చేసుకుంటుంది. ఒక రోజు రాంత్రి సడెన్‌గా ఆమెకు ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి నన్ను మర్చిపోయా అంటూ మాట్లాడు. ఎవరు మీరు అని ప్రశ్నించగా.. నీ ప్రియుడినని చెప్పాడు. అప్పుడు ఆమె అతడిని గుర్తు పట్టింది. చెప్పు అంది.. నిన్ను ఒకసారి కలవాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. కానీ అతను వినకుండా బతిమిలాడాడు. చివరకు రాత్రి 11 గంటలకు ఆమె అతడి వద్దకు స్నేహితరాలితో కలిసి వెళ్లింది.. అక్కడి వెళ్లిన తర్వాత అతడు ఏం చేశాడంటే..
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఫిర్దోస్ నగర్‌కు చెందిన అల్లు షేక్ గతంలో రుక్సానా అనే యువతిని ప్రేమించాడు. వివిధ కారణాల వల్ల వారు విడిపోయారు. ఆమెకు వేరొకరితో పెళ్లయింది. కొద్ది రోజుల తర్వాత అతడు ఆమెకు ఫోన్ చేసి ఓసారి కలవాలని కోరాడు. బయటికి రమ్మని అడిగాడు. దానికి మొదట ఆమె నిరాకరించినా.. అతడు బతిమిలాడితే చివరకు ఒప్పుకుంది. సోమవారం రాత్రి 11గంటలకు రుక్సానా ఆమె స్నేహితురాలు అఫ్సానాని వెంటబెట్టుకుని మాజీ ప్రియుడి వద్దకు వెళ్లింది.
రాజ్‌బారా చౌపట్టి దగ్గర వారిద్దరు అల్లు షేక్‌ని కలిశారు. అక్కడ అల్లు, రుక్సానా మధ్య మాటామాటా పెరిగింది. దీంతో అతడు వెంట తెచ్చుకున్న కత్తితో రుక్సానాపై దాడిచేశాడు. అడ్డుకోబోయిన అఫ్సానాని కూడా కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో రుక్సానా కాలిపై రెండు గాయాలవగా, అఫ్సానాకు చేతికి గాయమైంది. తర్వాత నిందితుడే గాయపడ్డ వారిద్దరిని ఎంవై ఆసుపత్రిలో చేర్పించి, అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడు దొంగతనం కేసులో జైలుపాలై ఇటీవలే విడుదలయ్యాడని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న అల్లుకోసం గాలిస్తున్నారు.
Read Also.. Crime News: ఆ ఇద్దరు కలిసి మాట్లాడుకోవడమే నేరమా.. చెట్టకు కట్టేసి ఆటవిక క్రీడ..
Crime News: వేశ్యతో ప్రేమ.. హత్యకు పథకం.. అడ్డొచ్చిన భార్య.. సీన్లోకి పోలీసులు