TS High Court: వినాయక నిమజ్జనంపై వివరాలు సమర్పించాలి.. జీహెచ్ఎంసీ, హైదరాబాద్ సీపీలకు హైకోర్టు ఆదేశాలు..

TS High Court: వినాయక నిమజ్జనంపై వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని మరోసారి హైకోర్టు ఆదేశించింది. నిమజ్జనం సందర్భంగా జనం భారీగా గుమిగూడకుండా ఏం చర్యలు తీసుకుంటారు?

TS High Court: వినాయక నిమజ్జనంపై వివరాలు సమర్పించాలి.. జీహెచ్ఎంసీ, హైదరాబాద్ సీపీలకు హైకోర్టు ఆదేశాలు..
Vinayaka Statues
Follow us
uppula Raju

|

Updated on: Aug 19, 2021 | 6:00 AM

TS High Court: వినాయక నిమజ్జనంపై వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని మరోసారి హైకోర్టు ఆదేశించింది. నిమజ్జనం సందర్భంగా జనం భారీగా గుమిగూడకుండా ఏం చర్యలు తీసుకుంటారు? అని ప్రశ్నించింది. సెప్టెంబరు 1లోగా నివేదికలు సమర్పించాలని జీహెచ్ఎంసీ, హైదరాబాద్ సీపీలకు హైకోర్టు ఆదేశించింది. నివేదిక సమర్పించకపోతే సీనియర్ అధికారులు హైకోర్టుకు హాజరుకావాలని పేర్కొంది. హుస్సేన్‌సాగర్‌లో గణేష్, దుర్గ విగ్రహాల నిమజ్జనం నిషేధించాలన్న న్యాయవాది వేణుమాధవ్ పిల్‌పై విచారించింది.

ఇళ్లల్లోనే మట్టిగణపతులను పూజించాలని ప్రజలకు సూచిస్తామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. సూచనలు కాదని, స్పష్టమైన ఆదేశాలు ఉండాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. మతపరమైన సెంటిమెంట్లు మంచిదే కానీ.. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టొద్దని హైకోర్టు పేర్కొంది. వినాయక నిమజ్జనంపై తదుపరి విచారణ సెప్టెంబరు 1కి వాయిదా పడింది. అయితే వినాయక చవితి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియాలో బాగా ఫేమస్ అయిన పండగ వినాయక చవితి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ముఖ్యంగా ఆఖరి ఘట్టం వినాయక చవితి నిమజ్జనం చాలా వైభవంగా ఉంటుంది. నిమజ్జనం రోజున జనాలందరు కూడా ఆట పాట లతో ఇంకా ఊరేగింపులతో బాగా సందడి చేస్తారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక కరోనా ప్రభావం వల్ల గత సంవత్సరం నుంచి కూడా ఈ సంబరాలపై ఆంక్షలు విధించింది ప్రభుత్వం. అయితే కెమికల్స్ కలిసిన గణేశ్‌ విగ్రహాలతో పర్యావరణం రోజు రోజుకు కలుషితం అయిపోతుంది. అందుకే చాలామంది పర్యావరణ వేత్తలు మట్టి విగ్రహాలను వాడాలని, లేదంటే ఊరికొక విగ్రహాం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ సంవత్సరం ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి.

AP Crime News: గుంటూరు జిల్లాలో బ్యాంకు ఉద్యోగి పేరిట మహిళకు టోకరా.. లక్ష రూపాయలు అపహరించిన దుండగుడు

Minister Peddireddy: శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్న మంత్రి పెద్దిరెడ్డి.. ఆయనతో పాటు మరో ఎంపీ, ఎమ్మెల్యే

AP Crime News: కర్నూల్‌ జిల్లాలో ఇద్దరు దొంగల అరెస్ట్.. కోటి విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం..