రియల్ ఎస్టేట్ కంపెనీకి షాకిచ్చిన అటవీశాఖ.. చెట్లు నరికినందుకు ఏం చేసిందంటే..?

|

Sep 29, 2021 | 10:10 PM

Crime News: హరితహారం పేరుతో ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం మొక్కలు నాటుతుంటే మరోవైపు కొంతమంది తమ స్వార్థం కోసం ఏపుగా పెరిగిన చెట్లను నరుకుతున్నారు.

రియల్ ఎస్టేట్ కంపెనీకి షాకిచ్చిన అటవీశాఖ.. చెట్లు నరికినందుకు ఏం చేసిందంటే..?
Forest
Follow us on

Crime News: హరితహారం పేరుతో ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం మొక్కలు నాటుతుంటే మరోవైపు కొంతమంది తమ స్వార్థం కోసం ఏపుగా పెరిగిన చెట్లను నరుకుతున్నారు. ఇప్పటికే వాతావరణం కాలుష్యంతో నిండిపోయింది. ఇప్పుడు ఉన్న చెట్లను కూడా నరికేస్తే మనిషి మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. అందుకే చెట్లు నరికిన వారిపై అటవీశాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది. తాజాగా అనుమతులు లేకుండా చెట్లు నరికిన ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీకి 4 లక్షల జరిమానా విధించింది. దీంతో మరోసారి ఏ కంపెనీ కూడా ఇలాంటి సాహసం చేయకుండా హెచ్చరించినట్లయింది. వివరాల్లోకి వెళితే..

రంగారెడ్డి జిల్లా మొయినా బాద్ మండలం చిలుకూరు పరిధిలో వెస్ట్ సైడ్ వెంచర్స్ అనే సంస్థ ఉంది. వారి భూమి పరిధిలో ఉన్న 65 చెట్లను సంస్థ ప్రతినిధులు గత వారం ఎలాంటి అనుమతులు లేకుండా నరికివేశారు. స్థానికులు ఫిర్యాదు చేయటంతో అటవీ శాఖ అధికారులు తనిఖీ చేశారు. చెట్లను విచక్షణారహితంగా తొలగించినట్లు నిర్ధారించారు. విచారణ చేసి వాల్టా చట్టం ప్రకారం నాలుగు లక్షల రూపాయల జరిమానా విధించారు.

అంతేకాదు తొలగించిన చెట్లకు బదులుగా మళ్లీ మొక్కలు నాటి, సంరక్షించాలనే నిబంధన జారీ చేశారు. లేదంటే వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయితే అటవీ శాఖ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని అందరు ప్రశంసిస్తున్నారు. మరోసారి ఏ కంపెనీ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడకుండా చేశారని అభినందించారు.

Char Coal Face Mask: నల్లటి బొగ్గు మీ చర్మానికి మెరుగైన మెరుపు ఇస్తుంది.. ఎలానో తెలుసుకోండి!

హెయిర్‌ఫాల్, చుండ్రుతో బాధపడుతున్నారా..అయితే ఈ నీళ్లతో చెక్‌ పెట్టేయండి..! వీడియో

Viral Video: నీళ్లు తాగుతున్న ఆవును వేటాడిన మొసళ్లు.. కట్ చేస్తే సీన్‌లోకి.. వైరల్ వీడియో!