గుంటూరు జిల్లా వినుకొండ మండలంలో విషాదం చోటుచేసుకుంది. అందుగుల కొత్త పాలెం ఎస్సీ కాలనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. నాలుగు పూరిగుడిసెలు కాలి బూడిదయ్యాయి. ఓ పూరింట్లో వంట చేస్తుండగా నిప్పు ఎగిసిపడి గుడిసెకు అంటుకుంది. స్థానికులు మంటలు ఆపేందుకు ప్రయత్నిస్తుండగానే.. క్షణాల్లో మంటలు వేగంగా వ్యాపించి పక్కనున్న పూరిళ్లకు కూడా అంటుకుంది. దీంతో నాలుగు గుడిసెలు పరశురామప్రీతి అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రాంతానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ అగ్ని ప్రమాదంలో పూరిగుడిసెల్లో జీవిస్తున్న పేదల జీవితాలను అందకారంలోకి నెట్టేసింది. తమ సర్వం బుగ్గిపాలు కావడంతో నాలుగు కుటుంబాలకు చెందిన బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
Also Read..
Viral Video: అది చెయ్యా.. సుత్తా..? పిడికిలిలో గుడ్డు పగలకుండా ఇది ఎలా సాధ్యం స్వామి
రహస్యాల శోధనలో నాసా సరికొత్త ముందడుగు..అతి దగ్గరగా సూర్యుని ఫోటో.. సోషల్ మీడియాలో వైరల్!