పునాదుల తవ్వకంలో బిందె లభ్యం.. బంగారు నాణేలతో ఉడాయించిన కూలీలు.. చివరికి ఏమైందంటే..!

|

Aug 05, 2021 | 5:18 AM

మనపాడు గ్రామానికి చెందిన జనార్దన్‌రెడ్డి.. ఇంటి నిర్మాణం కోసం ప్లాన్ చేశాడు. పునాదులు తవ్వేందుకు తొమ్మిది మంది కూలీలను ఏర్పాటు చేశాడు. ఆ కూలీలు పునాదులు తవ్వుతుండగా బంగారు నాణేలు గల..

పునాదుల తవ్వకంలో బిందె లభ్యం.. బంగారు నాణేలతో ఉడాయించిన కూలీలు.. చివరికి ఏమైందంటే..!
Gold
Follow us on

ఓ ఇంటి నిర్మాణం కోసం కొందరు కూలీలు గుంతలు తవ్వుతున్నారు. ఇంతలో బంగారు నాణేలు ఉన్న బిందె బయటపడింది. బిందెలో దాదాపు 98 బంగారు నాణేలు ఉన్నాయి. వాటిని తీసుకుని తొమ్మిది మంది కూలీలు ఉడాయించారు. కానీ, పోలీసుల చేతికి చిక్కడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలోని మనపాడులో చోటుచేసుకుంది. సీఐ వెంకటేశ్లర్లు వివరాల మేరకు.. మనపాడు గ్రామానికి చెందిన జనార్దన్‌రెడ్డి.. ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతున్నాడు. దీనికోసం తొమ్మిది మంది కూలీలను ఏర్పాటు చేశాడు. ఆ కూలీలు పునాదులు తవ్వుతుండగా బంగారు నాణేలు గల బిందె బయటపడినట్లు పలు పేపర్లలో కథనాలు వచ్చాయి.

దీంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పునాదులు తవ్విన తొమ్మిది మంది కూలీలను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, నిందుతులు పూర్తి వివరాలు పోలీసులకు తెలిపారు. పునాదులు తవ్వుతుండగా బిందె బయటపడిందని, ఆ బిందెలో 98 బంగారు నాణేలు ఉన్నాయని, ఇంటి యజమానికి చెప్పకుండా తామే పంచుకున్నామని కూలీలు ఒప్పుకున్నారు. దీంతో ఆ తొమ్మిది మందిని అరెస్టు చేసి, ఇండియన్ ట్రెజరీ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

కాగా, ఒక్కో బంగారు నాణెం సుమారు 3 గ్రాముల ఉందని పోలీసులు తెలిపారు. అయితే, బంగారు నాణేలను ఈ తొమ్మిది మందిలో కొందరు ఆభరణాలు చేయించుకోగా, మరి కొందరు వాటిని అమ్మి డబ్బు తీసుకున్నారు. కూలీల వద్ద నుంచి 12 తులాల12 గ్రాముల బంగారు ఆభరణాలతోపాటు రూ.4.60లక్షల నగదు స్వాధీనం ఆయన పేర్కొన్నారు. ఈమేరకు నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని ఆయన తెలిపారు.

Also Read: Suspicious death: చీరాల రైల్వే ట్రాక్‌పై యువకుడు అనుమానాస్పద మ‌ృతి.. హత్య చేసి ఉంటారని అనుమానాలు

ఢిల్లీలో ఆ దారుణ ఘటన.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ.. బీజేపీ ఎద్దేవా

రాహుల్ గాంధీ తెలిసే తప్పు చేశారు.. కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్