Telangana Tiger Skin smugglers Arrest: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని అభయారణ్యంలో స్మగ్లర్ల వేటకు మరో పులి హతమైంది. పులి చర్మం, అవయవాల స్మగ్లింగ్ కోసం పులులను వేటాడి చంపుతున్నారు స్మగ్లర్లు. తాజాగా ములుగు జిల్లాలో మరో పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వాజేడు సమీపంలో పులి చర్మాన్ని స్వాధీనం చేసుకుని, స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. చత్తీస్‌గఢ్ నుంచి పట్టణ ప్రాంతాలకు తరలిస్తుండగా స్మగ్లర్లను పట్టుకున్నారు పోలీసులు. దీంతో ఈ ఏరియాలో ఇప్పుడు మూడో పులి కూడా హతమైందని తెలిపారు పోలీసులు.
తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అడవుల్లో పులుల వేట ఆగడం లేదు… పెద్దపులి అవయవాల అమ్మకాలతో అక్రమ సంపాదనకు అలవాటు మానవ మృగాలు ఆ మూగ జీవుల ప్రాణాలు పొట్టన పెట్టుకుంటున్నారు.. తాజాగా మరో పెద్దపులి వేటగాళ్ల కాటుకు బలైంది.. గోదావరి పరివాహక అడవుల్లో పులిని హతమార్చిన వేటగాళ్లు ఆ పులి చర్మాన్ని పట్టణానికి తరలిస్తూ పోలీసులకు పట్టబడ్డారు.. ఐదుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు పంపారు.
గడిచిన రెండు నెలల వ్యవధిలో మూడు పెద్ద పులులు హతమయ్యాయి. వేటగాళ్ల కాటుకు ఆ క్రూరమృగాలు ప్రాణభయం భీతిల్లిపోతున్నాయి.. ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అడవుల్లో పులిని హతమార్చిన స్మగ్లర్లు ఆ పులి చర్మాన్ని పట్టణానికి తరలిస్తూ పట్టబడ్డారు.. పులి చర్మంతో పాటు, గోర్లు, ఇతర అవయవాలకు లక్షలాది రూపాయల ధరలు పలుకు తుండడంతో ఈ వేటకు అంతం లేకుండా పోయింది..తాజాగా ఈ పులి చర్మాన్ని ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం జగన్నాధపురం జంక్షన్ లో పోలీసులు పట్టుకున్నారు. కొందరు స్మగ్లర్లు ద్విచక్ర వాహనాలపై పులి చర్మాన్ని తరలిస్తుండగా వాహనాల తనిఖీల్లో పట్టబడ్డారు. వీరిలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన బాలకృష్ణ అనే వ్యక్తితో పాటు ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన విగ్నేష్, శ్రీను, రమేష్, చంటి అనే ఐదుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. ములుగు SP సంగ్రామ్ సింగ్ పాటిల్ స్మగ్లర్లను మీడియా ముందు హాజరుపర్చి రిమాండ్ కు పంపారు.
ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్డులోని గోదావరి పరివాహక అడవులు పులుల వేటకు కేరాఫ్ అడ్రస్ గా మారాయి. ఉచ్ఛులు విద్యుత్ వైర్లు అమర్చి వాటి ప్రాణాలు పొట్టనపెట్టుకుంటున్నారు. తాజాగా లభించిన పులి చర్మంతో హతమైన పులుల సంఖ్య మూడుకు చేరింది. గడిచిన రెండు నెలల వ్యవధిలో మూడు పులులను హతమార్చి అవయవాలను అమ్మకానికి తరలిస్తూ పట్టుబడ్డటం కలకలం సృష్టిస్తోంది.
Read Also… Home Guards Salaries: హోంగార్డులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. 30 శాతం జీతాలు పెంపు!