AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం.. ఆస్పత్రిలోనే అన్నదాత బలవన్మరణం..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు (KTPP) అధికారుల నిర్లక్ష్యం, ఓ ప్రైవేటు ఆస్పత్రి స్వార్థం అమాయక రైతు ప్రాణాలు బలిగొన్నాయి. జెన్ కో నిర్మాణం లో భూమి కోల్పోయిన బాధితుడు పరిహారం కోసం పోరాటం చేయలేక పురుగుల మందు సేవించాడు.

Telangana: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం.. ఆస్పత్రిలోనే అన్నదాత బలవన్మరణం..
Basha Shek
|

Updated on: Apr 14, 2022 | 5:10 PM

Share

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు (KTPP) అధికారుల నిర్లక్ష్యం, ఓ ప్రైవేటు ఆస్పత్రి స్వార్థం అమాయక రైతు ప్రాణాలు బలిగొన్నాయి. జెన్ కో నిర్మాణం లో భూమి కోల్పోయిన బాధితుడు పరిహారం కోసం పోరాటం చేయలేక పురుగుల మందు సేవించాడు. సెక్యూరిటీ సిబ్బంది తీసుకెళ్లి హాస్పిటల్ లో వదిలేశారు. అయితే ఆస్పత్రి యాజమాన్యం బిల్లు కట్టలేదని వేధించడంతో అదే హాస్పిటల్ లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహబూబ్ పల్లి గ్రామానికి చెందిన మర్రి బాబు (50)అనే రైతు వ్యవసాయం చేసుకుంటు జీవనం సాగించేవాడు. అయితే కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటులో భాగంగా విలువైన తన రెండెకరాల భూమిని కోల్పోయాడు. భూమి పోయినా పర్లేదు తన కుమారునికి KTPPలో ఏదో ఒక ఉద్యోగం వస్తుందని ఆశ పడ్డాడు. అయితే కుమారుడి ఉద్యోగం కోసం KTPP అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేదు. అప్పట్లో ఉద్యోగ హామీ ఇచ్చిన అధికారులు కూడా మారిపోయారు. తిరిగి తిరిగి విసుగుచెందిన మర్రి బాబు ఈనెల 1న KTPP ప్రధాన గేట్ ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. KTPP అధికారులు అతడిని మంజూర్ నగర్ లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో జాయిన్ చేసి చేతులు దులుపుకున్నారు.

బిల్లు కట్టలేక..

కాగా ఆస్పత్రిలో పది రోజుల పాటు చికిత్స పొందిన బాధితుడు క్రమంగా కోలుకున్నాడు. అయితే ఇక్కడే అతనికి మరొక చిక్కొచ్చి పడింది. ఆస్పత్రి బిల్లు అరవై వేలు కావడంతో బిల్లు కట్టే స్థోమత లేకపోవడంతో బాధితుడి కుటుంబ సభ్యులు అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన మర్రిబాబు ఆస్పత్రి గదిలోనే ఫ్యాన్ కు బెడ్ షీట్ తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న హాస్పిటల్ యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం పరకాల ఆస్పత్రి మార్చురీకి మృతదేహాన్ని తరలించారు. ఈ ఘటనపై ఆస్పత్రి యాజమాన్యం స్పందిస్తూ ‘ కేటీపీపీ సిబ్బంది బాధితున్ని హాస్పిటల్‌లో ఈనెల 1వ తేదీన జాయిన్ చేశారు. అప్పటి నుంచి కేటీపీపీ యాజమాన్యం, బాధితుడి కుటుంబసభ్యులు గానీ ఒక్క రూపాయి కూడా బిల్లు కట్టలేదు. అయినా అతనికి ట్రీట్మెంట్ చేసి బతికించాం. చికిత్సకు డబ్బులు కట్టవలసిందిగా అతని కుటుంబ సభ్యులకు తెలియజేశాం.దురదృష్టవశాత్తూ ఇంతలోనే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు’ అని చెప్పుకొచ్చారు. కాగా ఆస్పత్రి యాజమాన్యం వల్లే మర్రిబాబు ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:Prime Ministers Museum: నెహ్రూ నుంచి మోదీ వరకు అందరి చరిత్ర.. ప్రధానమంత్రి మ్యూజియం ప్రత్యేకతేంటో తెలుసుకోండి!

Sorakayala Swamy: ఈ స్వామికి సొరకాయను సమర్పిస్తే.. ఎటువంటి రోగమైనా మాయమట.. కోర్కెలు తీర్చే సొరకాయస్వామిగా ప్రసిద్ధి

Sorakayala Swamy: ఈ స్వామికి సొరకాయను సమర్పిస్తే.. ఎటువంటి రోగమైనా మాయమట.. కోర్కెలు తీర్చే సొరకాయస్వామిగా ప్రసిద్ధి