బ్రేకింగ్ : మంగళగిరిలో టీడీపీ నేత దారుణ హత్య
గుంటూరు జిల్లా టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. మంగళగిరికి చెందిన ఆ పార్టీ నేత ఉమాయాదవ్‌ను దుండగులు కత్తులతో పొడిచి చంపేశారు. గతంలో ఓ మర్డర్ కేసులో ఉమాయాదవ్ నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లోకేష్ గెలుపు కోసం ప్రయత్నించిన వారిలో ఉమాయాదవ్ కూడా ఒకరని తెలుస్తోంది. అయితే పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.