హీరో సుశాంత్ సూసైడ్: బాలీవుడ్ ప్రముఖులపై కేసులు నమోదు

| Edited By:

Jun 17, 2020 | 4:16 PM

ప్రముఖ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(34) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ సూసైడ్ విషయం కాస్తా ప్రస్తుతం బాలీవుడ్‌లో‌ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులపై కేసులు నమోదయ్యాయి. కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్, ఏక్తాకపూర్‌లపై బీహార్ ముజఫర్ కోర్టులో..

హీరో సుశాంత్ సూసైడ్: బాలీవుడ్ ప్రముఖులపై కేసులు నమోదు
Follow us on

ప్రముఖ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(34) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ సూసైడ్ విషయం కాస్తా ప్రస్తుతం బాలీవుడ్‌లో‌ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులపై కేసులు నమోదయ్యాయి. కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్, ఏక్తాకపూర్‌లపై బీహార్ ముజఫర్ కోర్టులో బుధవారం కేసు నమోదైంది. సుధీర్ కుమార్ ఓజా అనే లాయర్.. వారిపై ఈ కేసు పెట్టారు. సుశాంత్ సూసైడ్‌కి బాలీవుడ్‌లోని కొంతమంది ప్రముఖులే కారణమంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. సుశాంత్ ఆత్మహత్యపై నిర్మాత కరణ్ జోహర్, ఏక్తాకపూర్, సంజయ్ లీలా భన్సాలీ, సల్మాన్‌ఖాన్‌తో పాటు మరో 8 మందిపై బీహార్‌లోని ముజఫర్ కోర్డులో ఐపీసీ సెక్షన్ 306, 109, 504, 506 కింద పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.

సుశాంత్‌ని ఏడు చిత్రాల నుంచి కారణం లేకుండా తొలగించారని, అంతేగాక అతడు నటించిన కొన్ని సినిమాలను కూడా విడుదల కానీయలేదని.. అందువల్లే మానసిక ఒత్తిడిని భరించలేక అతను సూసైడ్ చేసుకున్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా సుశాంత్ ఆదివారం జూన్ 14వ తేదీన ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కొంతకాలంగా అతను డిప్రెషన్‌లో ఉన్నాడని, అందుకు సంబంధిచి చికిత్స కూడా తీసుకున్న ట్లు పోలీసులు తెలిపారు.

Read More: 

మళ్లీ లాక్‌డౌన్.. వైన్ షాపులకి పరుగులు పెడుతోన్న మందు బాబులు..

బిగ్ బ్రేకింగ్: కరోనాతో ముఖ్యమంత్రి పీఏ మృతి..

బ్రేకింగ్: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల..

షాకింగ్: ప్రతీ ఐదుగురిలో ఒకరికి కరోనా ముప్పు.. నిపుణుల రిపోర్ట్