ఆలయంలో దొంగతనానికి వెళ్లిన దొంగ.. 12 గంటపాటు నరకయాతన.. కారణం ఇదే..

దేవాలయ హుండీలో సొమ్ము కాజేయడానికి ప్రయత్నించిన ఒక దొంగ చెయ్యి అందులో ఇరుక్కుపోవడంతో 12గంటల పాటు నరకయాతన అనుభవించాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామ శివారులో గల మాసుపల్లి పోచమ్మ ఆలయంలో చోటుచేసుకుంది.

ఆలయంలో దొంగతనానికి వెళ్లిన దొంగ.. 12 గంటపాటు నరకయాతన.. కారణం ఇదే..
Police Arrest

Edited By:

Updated on: Apr 03, 2024 | 5:24 PM

దేవాలయ హుండీలో సొమ్ము కాజేయడానికి ప్రయత్నించిన ఒక దొంగ చెయ్యి అందులో ఇరుక్కుపోవడంతో 12గంటల పాటు నరకయాతన అనుభవించాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామ శివారులో గల మాసుపల్లి పోచమ్మ ఆలయంలో చోటుచేసుకుంది. ఆలయంలో పనిచేసే సురేష్ రాత్రి 10 గంటల ప్రాంతంలో హుండీ పైభాగాన్ని ధ్వంసం చేశాడు.

అందులో డబ్బు తీసేందుకు హుండీ లోపల చేయ్యి పెట్టాడు. అయితే సురేష్ చేయ్యి హుండీలోనే ఇరుక్కుపోయింది.దీంతో సుమారు 12 గంటల పాటు సురేష్ నరకయాతన అనుభవించాడు. ఉదయం దేవాలయానికి వచ్చిన భక్తులు గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు వచ్చి పోలీసుల సమక్షంలో గ్యాస్ కట్టర్‎తో సురేష్ చేతిని హుండీలోంచి తొలగించారు. అనంతరం దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తిని స్థానిక భిక్కనూర్ పోలీసులకు అప్పగించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..