మద్యం మత్తుతో మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. చిన్నచిన్న కారణాలకే ఆగ్రహానికి గురవుతూ.. సొంత వారిపైనే దాడికి తెగబడుతున్నారు. క్షణికావేశంలో తల్లిని గొడ్డలితో నరికి చంపాడు(Murder) ఓ ప్రబుద్ధుడు. కూర లేదని చెప్పినందుకే ఈ ఘటనకు పాల్పడ్డాడు. సమాజాన్ని విస్మయపరిచేలా జరిగిన ఈ ఘటన విశాఖ జిల్లా వంతాలలో చోటు చేసుకుంది. విశాఖపట్నం(Visakhapatnam) జిల్లా జి.మాడుగుల సమీపంలోని వంతాల పంచాయతీకి చెందిన రేగం రామన్నదొర, అర్జులమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు మత్స్యలింగం ఆదివారం అర్ధరాత్రి అధికంగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. తల్లిని నిద్రలేపి భోజనం పెట్టమని కోరాడు. చారు మాత్రమే ఉందనటంతో కూర లేదని ఆగ్రహించి తల్లిని కొట్టాడు. వద్దని వారించిన తండ్రితోనూ వాగ్వాదానికి దిగాడు.
ఈ గొడవ ఏ పరిస్థితులకు దారి తీస్తుందోన్న భయంతో రామన్న దొర తన పెద్ద కుమారుడిని తీసుకొస్తానని చెప్పి బయటకు వెళ్లాడు. రామన్న దొర బయటకు వెళ్లిన సమయాన్ని అదనుగా తీసుకున్న మత్స్యలింగం.. తల్లి అర్జులమ్మ తలపై గొడ్డలితో మోదాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అర్జులమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. రామన్నదొర ఇంటికి వచ్చే సమయానికి ఈ ఘటన జరగడంతో అతను కన్నీరుమున్నీరయ్యాడు. కన్నకొడుకు మత్య్యలింగంపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించాడు. రామన్నదొర ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Also Read
Suryapet: విషాదం.. వెల్డింగ్ పనులు చేస్తుండగా పేలిన పెట్రోల్ ట్యాంకర్.. ఇద్దరు మృతి
Sarayu Roy: బిగ్‌బాస్ ఫేమ్ సరయు అరెస్ట్.. స్టేషన్‌కు తరలించిన బంజారాహిల్స్ పోలీసులు