Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: తండ్రి అక్రమ సంబంధాలు.. పరువు పోతోందని కొడుకు ఏం చేశాడంటే..?

Son kills father: తండ్రి అక్రమ సంబంధాలు, ఆ తర్వాత గొడవలు భరించకలేక.. ఓ కొడుకు కన్న తండ్రిని దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన

Crime News: తండ్రి అక్రమ సంబంధాలు.. పరువు పోతోందని కొడుకు ఏం చేశాడంటే..?
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 06, 2021 | 8:25 AM

Son kills father: తండ్రి అక్రమ సంబంధాలు, ఆ తర్వాత గొడవలు భరించకలేక.. ఓ కొడుకు కన్న తండ్రిని దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో కలకలం రేపింది. అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగర శివారులోని ఇందిరమ్మకాలనీకి చెందిన నగేష్, లక్ష్మిదేవి దంపతులు. వీరికి కుమారుడు నాగరాజు, కుమార్తె ఉన్నారు. నగేష్ బోర్‌వెల్స్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. 25 ఏళ్ల కిందట భార్య మృతి చెందింది. ఆ తర్వాత నగేష్ రెండో వివాహం చేసుకున్నాడు. అయితే.. ఆమె వివామైన ఏడాదికే నగేష్‌ను వదిలేసి వెళ్లిపోయింది. అనంతరం నగేష్ కుమార్తెకు వివాహం చేశాడు. అప్పటినుంచి తండ్రి, కుమారుడు, కలిసి నివాసముంటున్నారు. ఈ క్రమంలో నగేష్ కాలనీలో పలువురు మహిళలతో వివాహేత సంబంధం పెట్టుకున్నాడు. ఆ కుటుంబాల్లో దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. విషయం కుమారుడు నాగరాజుకు తెలిసి పలుమార్లు తండ్రిని మందలించాడు. అయినప్పటికీ తండ్రిలో ఎలాంటి మార్పు రాలేదు.

దీంతో విసుగుచెందిన నాగరాజు.. తండ్రి నగష్ తలపై ఇనుపరాడ్‌తో మోది హత్య చేశాడు. ఘటనపై ఎవరికీ అనుమానం రాకుండా రాత్రికి రాత్రే సమీపంలోని కాలువలో తండ్రి మృతదేహాన్ని పడేసి పరారయ్యాడు. అనంతరం జరిగిన విషయాన్ని సమీప బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అనంతరం నాలుగో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాలువలో గాలించి మృతదేహాన్ని బయటకు వెలికితీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడు నాగరాజు కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read:

Crime News: ఒకరితో ఇద్దరి అక్రమ సంబంధం.. అసలు సంగతి తెలిసి.. కత్తులతో దారుణంగా..

Cheddi Gang: తిరుపతివాసుల్లో వణుకుపుట్టిస్తున్న చెడ్డీ గ్యాంగ్.. ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు..

బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై నలుగురికి ఆ అవకాశం
బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై నలుగురికి ఆ అవకాశం
రోహిత్ & సచిన్ ఎమోషనల్ మీట్..ముంబై గెలుపు స్పెషల్!
రోహిత్ & సచిన్ ఎమోషనల్ మీట్..ముంబై గెలుపు స్పెషల్!
సీతాదేవి భూదేవిలో ఐక్యం అయిన ప్రదేశం ఎక్కడుందో తెలుసా..
సీతాదేవి భూదేవిలో ఐక్యం అయిన ప్రదేశం ఎక్కడుందో తెలుసా..
ఆరోగ్య బీమా క్లెయిమ్‌ రిజెక్ట్‌ అయ్యిందా? ఇలా చేస్తే సమస్యకు చెక్
ఆరోగ్య బీమా క్లెయిమ్‌ రిజెక్ట్‌ అయ్యిందా? ఇలా చేస్తే సమస్యకు చెక్
ఆరు రాశులకు ఖల యోగం! ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త
ఆరు రాశులకు ఖల యోగం! ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త
'దయచేసి ఆ వార్తలు నమ్మొద్దు.. కన్నప్ప సినిమాపై కీలక ప్రకటన
'దయచేసి ఆ వార్తలు నమ్మొద్దు.. కన్నప్ప సినిమాపై కీలక ప్రకటన
గుడికి సమీపంలోనే మహిళపై పైశాచికం.. విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు
గుడికి సమీపంలోనే మహిళపై పైశాచికం.. విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు
సిడ్నీ సిక్సర్స్‌లో కోహ్లీ? అసలు కథ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
సిడ్నీ సిక్సర్స్‌లో కోహ్లీ? అసలు కథ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆధార్‌-ఓటర్‌ ఐడీ లింక్‌ తప్పనిసరి కాదు! కానీ కారణం చెప్పాల్సిందే!
ఆధార్‌-ఓటర్‌ ఐడీ లింక్‌ తప్పనిసరి కాదు! కానీ కారణం చెప్పాల్సిందే!
900 కంటే ఎక్కువ మందుల ధరలు పెంపు.. మీరు వేసుకునే మందులున్నాయా?
900 కంటే ఎక్కువ మందుల ధరలు పెంపు.. మీరు వేసుకునే మందులున్నాయా?