ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు విరుచుకు పడ్డారు. ఇంతకాలం కోవిడ్‌తో వ్యాప్తితో మౌనంగా ఉంటున్న మావోయిస్టులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. నారాయణపూర్ జిల్లా చోటే డోంగార్ పోలీసు స్టేషన్ పరిధిలో అలజడి సృష్టించారు. నారాయణపూర్‌కు సమీపంలోని ఆందారి ఐరన్ ఓర్ ప్లాంట్‌లోని యంత్రాలను ధ్వంసం చేశారు. ప్రొక్లెయిన్ సహా ఆరు వాహనాలకు మావోయిస్టులు నిప్పు పెట్టారు. ఆయంత్రాలు పూర్తిగా కాలిపోయే వరకు అక్కడే ఉన్న దళం సభ్యులు… అనంతరం సూపర్ వైజర్ సహా పలువురు కార్మికులను బందీలుగా ఎత్తుకు పోయారు.
ఈ ఘటన జరిగిన విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. కూలీలను విడిచి పెట్టాలని పోలీసులు కోరినా… వినకుండా పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య భారీ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనను నారాయణపూర్ ఎస్పీ మోహిత్ గార్గ్ ధృవీకరించారు.