Simhachalam Lands Issue: సింహాచలం భూ అక్రమాలపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్‌

|

Aug 07, 2021 | 7:07 AM

AP Government: సింహాచలం భూముల అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దేవదాయశాఖకు చెందిన ఇద్దరు కీలక ఉద్యోగులను

Simhachalam Lands Issue: సింహాచలం భూ అక్రమాలపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్‌
Ap Govt
Follow us on

AP Government: సింహాచలం భూముల అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దేవదాయశాఖకు చెందిన ఇద్దరు కీలక ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు దేవాదాయశాఖ అడిషనల్‌ కమిషనర్‌ రామచంద్రమోహన్‌, ఏఈవో సుజాతను సస్పెండ్‌ చేస్తూ.. ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాలయ ఆస్తుల రిజిస్టర్ నుంచి భూముల తొలగింపులో.. ఏసీ రామచంద్రమోహన్‌, ఏఈవో సుజాతలు గత కొంతకాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మాన్సాస్ భూముల అమ్మకాల్లో రూ.74 కోట్లకుపైగా నష్టం జరిగినట్లు ప్రభుత్వానికి డిప్యూటీ కమీషనర్ పుష్పవర్థన్ కమిటీ నివేదిక అందించింది. దీంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.

సింహాచలం దేవస్థానం, మాన్సస్ ట్రస్ట్ ఈవోగా పనిచేసిన సమయంలో రామచంద్రమోహన్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని నిర్ధారణకావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. విచారణ కమిటీ ప్రాథమిక నివేదిక ఆధారంగా రామచంద్రమోహన్‌ను సస్పెండ్ చేసింది. ఆలయ భూ రికార్డుల తారుమారులో సింహాచలం దేవస్థానం డిప్యూటీ ఈవో సుజాత ప్రమేయం ఉన్నట్లుగా కమిటీ నిర్ధారించడంతో.. ఆమెను సైతం సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read:

AP Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం..

PCOD: అమ్మాయిల ఆరోగ్యంపై కల్తీ ఎఫెక్ట్.. అందుకే చిన్న వయసులోనే..