Lockup Death Case: మహిళ లాకప్‌డెత్‌ కేసులో.. ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్‌..

|

Jun 23, 2021 | 5:54 AM

Addaguduru Lockup Death Case: తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్‌‌లో మహిళ లాకప్ డెత్ సంఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలన్నీ

Lockup Death Case: మహిళ లాకప్‌డెత్‌ కేసులో.. ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్‌..
Suspended
Follow us on

Addaguduru Lockup Death Case: తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్‌‌లో మహిళ లాకప్ డెత్ సంఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలన్నీ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ లాకప్‌ డెత్‌ కేసులో చర్యలు చేపట్టారు. ఎస్‌ఐ మహేశ్‌, కానిస్టేబుళ్లు రషీద్‌, జానయ్యను సస్పెండ్‌ చేస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు. మూడు రోజులక్రితం లాకప్‌లో మరియమ్మ (45) అనే మహిళ మరణించింది. విచారణలో ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో బాధ్యులను సస్పెండ్‌ చేస్తూ సీపీ ఉత్తర్వులు వెలువరించారు. మల్కాజ్‌గిరి ఏసీపీని దర్యాప్తు అధికారిగా నియమిస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. లాకప్‌డెత్‌ ఘటనపై దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.

అయితే.. దర్యాప్తులో మహిళ లాకప్ డెత్ కేసులో ఎస్సై , కానిస్టేబుల్ పాత్ర తెలినట్టు గుర్తించారు. ఈ మేరకు ఎస్సై , ఇద్దరు కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేస్తూ రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read:

రష్యన్ నేషనల్ పార్కులో దారుణం…16 ఏళ్ళ బాలుడిపై ఎలుగుబంటి దాడి… కాల్చి చంపిన రేంజర్లు

Lover Suicide: పెళ్లిప్పుడే వద్దన్న ప్రేయసి.. ఆవేశంతో నాలుగో అంతస్తు నుంచి దూకి ప్రేమికుడు ఆత్మహత్య