AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బ్రేకింగ్.. ఆప్ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై కాల్పులు.. ఒకరి మృతి

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఓ వైపుం సంబరాల్లో మునిగిపోతున్న వేళ.. అదే పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు దిగారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మెహ్‌రౌలీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నరేష్ యాదవ్ కాన్వాయ్‌పై దుండగులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో పార్టీకి చెందిన ఓ కార్యకర్త మరణించగా.. మరో కార్యకర్త గాయపడినట్లు ఆప్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎమ్మెల్యేగా విజయం సాధించిన నేపథ్యంలో […]

బిగ్ బ్రేకింగ్.. ఆప్ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై కాల్పులు.. ఒకరి మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 12, 2020 | 5:54 AM

Share

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఓ వైపుం సంబరాల్లో మునిగిపోతున్న వేళ.. అదే పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు దిగారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మెహ్‌రౌలీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నరేష్ యాదవ్ కాన్వాయ్‌పై దుండగులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో పార్టీకి చెందిన ఓ కార్యకర్త మరణించగా.. మరో కార్యకర్త గాయపడినట్లు ఆప్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎమ్మెల్యేగా విజయం సాధించిన నేపథ్యంలో స్థానికంగా ఉన్న ఓ దేవాలయానికి వెళ్లగా.. తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే కాన్వాయ్‌పై కాల్పుల ఘటనపై ఆప్ తన అధికారికి ట్విట్టర్‌ ద్వారా ఖండించింది.