Shilpa Chowdary Case: శిల్పా చౌదరికి ఎట్టకేలకు బెయిల్.. కానీ షరతులు వర్తిస్తాయి.. అవేంటంటే..?

|

Dec 24, 2021 | 7:25 AM

Shilpa chaudhary Cheating Case: కిట్టి పార్టీల కిలాడీ.. శిల్పా చౌదరికి ఎట్టకేలకూ బెయిల్‌ మంజూరైంది. ఉప్పర్‌పల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. అధికవడ్డీ, పెట్టుబడులు, కిట్టీపార్టీల

Shilpa Chowdary Case: శిల్పా చౌదరికి ఎట్టకేలకు బెయిల్.. కానీ షరతులు వర్తిస్తాయి.. అవేంటంటే..?
Shilpa Chowdary
Follow us on

Shilpa Chowdary Cheating Case: కిట్టి పార్టీల కిలాడీ.. శిల్పా చౌదరికి ఎట్టకేలకూ బెయిల్‌ మంజూరైంది. ఉప్పర్‌పల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. అధికవడ్డీ, పెట్టుబడులు, కిట్టీపార్టీల పేరుతో కోట్లు కొల్లగొట్టినట్లు ఆమె ఆరోపణలు ఎదుర్కొంటోంది. కిట్టిపార్టీల పేరుతో టాలీవుడ్‌ ప్రముఖులు, ఇతరులను మోసం చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన శిల్పాచౌదరి.. గత కొన్ని రోజుల నుంచి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆమె మూడు కేసులను విచారించిన ఉప్పర్‌పల్లి కోర్టు.. మొత్తం కేసుల్లోనూ ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. పలుసార్లు బెయిల్‌ తిరస్కరించగా.. ధర్మాసనం గురువారం కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ప్రతి శనివారం శిల్పా చౌదరి నార్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌లో హాజరై సంతకం చేయాలనే నిబంధనతో బెయిల్‌ ఇచ్చారు. 10వేల చొప్పున షూరిటీలు కోర్టుకు సమర్పించాలని కోరింది న్యాయస్థానం. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విదేశాలకు వెళ్లవద్దని కోర్టు నిబంధన విధించింది. దీంతోపాటు ఎవరితోనూ ఫోన్‌లో కానీ, డైరెక్ట్‌గా గానీ కేసు విషయం మాట్లాడకూడదని స్పష్టం చేసింది. ఇక సాక్షులను బెదిరించరాదని శిల్పాచౌదరిని కోర్టు ఆదేశించింది.

కిట్టీపార్టీల పేరుతో టాలీవుడ్‌ ప్రముఖులు, ఇతరులకు మాయమాటలు చెప్పి కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు శిల్పా చౌదరిపై ఆరోపణలు ఉన్నాయి. చిట్టీలు మొదలు..కిట్టీపార్టీల వరకు అనేక రంగాల్లో వేలు పెట్టిన శిల్పపై పెద్ద మొత్తాల్లో తమకు డబ్బులు చెల్లించాలంటూ చాలామంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇప్పటివరకూ సుమారు 200 కోట్ల రూపాయలు సంపాదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శిల్పాచౌదరి చంచల్‌గూడ జైలులో ఉన్నారు. బెయిల్‌ మంజూరు కావడంతో ఇవాళ శిల్పా విడుదల కానుంది. అయితే శిల్పా కొల్లగొట్టిన డబ్బంతా ఎక్కడుంది..? రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టిందా..? ఆ డబ్బంతా రికవరీ చేసి బాధితులకు న్యాయం చేస్తారా..? అనేది చర్చనీయాంశమైంది.

Also Read:

RBI Penalty: ఆర్బీఐ కొరఢా.. మొబిక్విక్‌, స్పైస్‌ మనీలకు భారీ జరిమానా.. ఎందుకంటే..!

Srisailam Drone: శ్రీశైలంలో మరోసారి డ్రోన్‌ కలకలం.. డ్రోన్‌ ప్రయోగాన్ని అడ్డుకున్న ఆలయ భద్రతా సిబ్బంది..