Aryan Khan Drugs Case: మళ్లీ ఎన్సీబీ కార్యాలయానికి కింగ్ ఖాన్ కొడుకు ఆర్యన్‌ ఖాన్‌.. ఎందుకో తెలుసా..?

|

Nov 05, 2021 | 1:48 PM

Shah Rukh Khan’s son Aryan Khan: బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్‌ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ శుక్రవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎదుట హాజరయ్యాడు. ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఈ రోజు

Aryan Khan Drugs Case: మళ్లీ ఎన్సీబీ కార్యాలయానికి కింగ్ ఖాన్ కొడుకు ఆర్యన్‌ ఖాన్‌.. ఎందుకో తెలుసా..?
Aryan Khan
Follow us on

Shah Rukh Khan’s son Aryan Khan: బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్‌ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ శుక్రవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎదుట హాజరయ్యాడు. ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల లోపు హాజరుకావాల్సి ఉండటంతో ఆర్యన్ కార్యాలయానికి చేరుకున్నాడు. కండిషన్ బెయిల్ నేపథ్యంలో అతను మరోసారి కార్యాలయానికి రావాల్సి వచ్చింది. కింగ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ తీసుకుంటూ.. అక్టోబర్ 2న ఎన్సీబీ అధికారుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు. ఎన్సీబీ విచార‌ణ అనంత‌రం అక్టోబ‌ర్ 8న అతన్ని ఆర్ధర్ రోడ్ జైలుకు తరలించారు. ఆ త‌ర్వాత ఎన్సీబీ స్పెష‌ల్ కోర్టు, కింది కోర్టుల‌లో ఆర్యన్ ఖాన్ తరుపు న్యాయవాదులు బెయిల్ పిటిష‌న్‌లు వేయ‌గా కోర్టులు తిరస్కరిస్తూ వచ్చాయి.

దీంతో ముంబై హైకోర్టులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిష‌న్ పై వరుసగా.. విచారణ జరిగింది. విచార‌ణ అనంతరం ముంబై హైకోర్టు అక్టోబ‌ర్ 28న ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. అనంతరం ఆర్యన్ ఖాన్ అక్టోబ‌ర్ 30న జైలు నుంచి విడుద‌ల అయ్యాడు. అయితే బెయిల్ మంజూరు సంద‌ర్భంగా ముంబై హైకోర్టు షరతులు విధించింది. ప్రతి శుక్రవారం ఎన్సీబీ ముందు హాజ‌రు కావాల‌ని ఆర్యన్ ఖాన్‌కు ష‌ర‌తులు విధిస్తూ కండీషన్ బెయిల్ మంజూరు చేశారు. అంతేకాకుండా ఉదయం 11 గంటల నుంచి 2 గంటల మధ్య హాజరుకావాలని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఆర్యన్ ఖాన్ ఈ రోజు ఎన్సీబీ ఎదుట హాజ‌ర‌య్యాడు.

కాగా.. ఈ డ్రగ్స్ కేసుపై రాజకీయ దుమారం కూడా చేలరేగిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసును విచారిస్తున్న ఎన్సీబీ అధికారి వాంఖడే లంచం డిమాండ్ చేసినట్లు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ పలు ఆరోపణలు చేశారు. దీనిలో భాగంగా సమీర్‌ వాంఖడేపై కూడా విచారణ కొనసాగుతోంది.

Also Read:

Crime News: సీఐడీ సీరియల్ చూసి దారుణానికి పాల్పడిన మైనర్లు.. ఓ వృద్ధురాలిని అత్యంత పాశవికంగా..

Crime News: పండగపూట దారుణం.. ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపిన దుండగులు.. ఒకరు మృతి..