AP Crime: వ్యాయామ ఉపాధ్యాయుడి కీచక బుద్ధి.. కోరిక తీరిస్తే కోరుకున్నది ఇస్తానని..

|

Feb 14, 2022 | 6:34 PM

విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి.. వారిని సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పాడు. విద్యార్థుల ఉన్నత జీవితానికి బాటలు వేయాల్సింది పోయి....

AP Crime: వ్యాయామ ఉపాధ్యాయుడి కీచక బుద్ధి.. కోరిక తీరిస్తే కోరుకున్నది ఇస్తానని..
Student Harassment
Follow us on

విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి.. వారిని సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పాడు. విద్యార్థుల ఉన్నత జీవితానికి బాటలు వేయాల్సింది పోయి.. ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. వ్యాయామ ఉపాధ్యాయుడిగా చెలామణి అవుతూ తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. విద్యార్థులకు వ్యాయామం నేర్పించకుండా వారి శరీర తీరుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. తన భార్యకు అనారోగ్యంగా ఉందని, తన కోరిక తీరుస్తే ఏం కావాలంటే అది ఇస్తానని విద్యార్థినికి ఆడియో సందేశం పంపాడు. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాయామ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలం శ్రీధరఘట్టలోని ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు.. రెండు రోజుల క్రితం ఓ విద్యార్థినికి ఫోన్‌ చేశాడు. అతని మాట తీరుపై తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. వాట్సాప్‌లోని ఆడియో చాటింగ్‌లో.. తన భార్యకు ఏడాదిగా ఆరోగ్యం సరిగా లేదని, పాఠశాలలోని తన గదిలోకి ఒంటరిగా వచ్చి తన కోరిక తీరిస్తే ఏమి కావాలన్నా తాను చూసుకుంటాననే వ్యాయామ ఉపాధ్యాయుడి మాటలు విన్న తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

ఈ విషయం తెలుసుకున్న వెంటనే వ్యాయామ ఉపాధ్యాయుడు అత్యవసరంగా సెలవు పెట్టి మరో ప్రాంతానికి వెళ్లిపోయాడు. ప్రధానోపాధ్యాయుడి దృష్టికి విద్యార్థిని తల్లిదండ్రులు విషయం తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాయామ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు.

Also Read

JNU VC: జేఎన్‌యూ కొత్త వీసీ శాంతిశ్రీ ముందున్న సవాళ్లు.. ఆమె ఎదుర్కొంటున్న విమర్శలు ఏంటి.?

Andhra Pradesh: రోడ్ల పక్కన దాబాల్లో మద్యం బంద్.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

ఉక్రెయిన్ పై దాడికి రష్యా సమాయత్తం.. అప్పటి పరిస్థితుల నుంచి ప్రస్తుతం వరకు జరిగిందిదే..