హైదరాబాద్‌లోని న్యూహఫీజ్‌పేట పరిధిలో గల హనీఫ్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. కీసర గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న బాలిక నందిని ఆత్మహత్య చేసుకుంది. కరోనా నేపథ్యంలో ఇంటి వద్దే ఉంటోన్న బాలికకు.. ఆన్‌లైన్ క్లాసులు ఉండటంతో తండ్రి సెల్‌ఫోన్ ఇచ్చాడు. అయితే ఫోన్‌లో బాలిక తరచూ చాటింగ్ చేస్తున్నట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్తాపం చెంది నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన గత నెల 28న చోటుచేసుకున్నప్పటికీ.. బాలిక తండ్రి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫోన్ చూడొద్దని మందలించినందుకే నందిని సూసైడ్ చేసుకుందని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా… ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.
వరంగల్‌లో అత్యాచారం కేసులో కార్పొరేటర్ భర్త అరెస్టు
వరంగల్‌లో అత్యాచారం కేసులో కార్పొరేటర్ భర్త అరెస్టు అయ్యారు. అర్ధరాత్రి శిరీష్‌ను వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ మిల్స్‌కాలనీ శిరీష్‌పై ఓ యువతి కంప్లైంట్ చేశారు. అత్యాచారం, నమ్మకద్రోహం, మోసం, బెదిరింపుల కింద కేసు నమోదయ్యాయి. పెళ్లి పేరిట నమ్మించి ఇంటికి పిలిచి అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు ఇచ్చారు. గత నెల 23న మిల్స్‌కాలనీ పీఎస్ పోలీసులు కేసు నమోదు చేయగా… పరారీలో ఉన్న శిరీష్‌ను అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. 2017 నుంచి శిరీష్ ప్రేమిస్తున్నానంటూ.. తన వెంట పడి పెళ్లి చేసుకుంటానని నమ్మించినట్లు యువతి… పోలీసులకు తెలిపింది. తనను చీట్ చేసి.. అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పింది. నగర శివారు ప్రాంతంలోని తమ కుటుంబ సభ్యుల పేరిట గల భూమిని అమ్మగా.. వచ్చిన డబ్బు నుంచి 90లక్షల రూపాయలు శిరీష్ ఖాతాల్లో జమచేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. తనను వివాహం చేసుకుంటాడనే నమ్మకంతో పెద్దమొత్తంలో డబ్బును శిరీష్ అకౌంట్లలో వేసినట్టు లావాదేవీల ఆధారాలతో పోలీసులకు కంప్లైంట్ చేసింది. అయితే శిరీష్ మరో యువతిని పెళ్లి చేసుకుని తనను మోసం చేయడమే కాకుండా…. తన డబ్బులు తిరిగివ్వకుండా తండ్రి సుధాకర్‌తో కలిసి బెదిరింపులకు దిగాడని ఆమె వెల్లడించింది.
Also Read: ‘ఎవరు గొప్ప’ అంటూ ఇద్దరు సెవెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఫైట్.. ఒకరు మృతి