20 నెలల్లో 10 హత్యలు.. సినిమాను తలపించే సైనెడ్ కిల్లర్ క్రైమ్ స్టోరీ!
నెత్తురు చుక్క చిండదు.. వంటిపై చిన్న గీత కూడా కనిపించదు.. డబ్బు కోసం సొంతవారిని సైతం హత్య చేసిన నర హంతకుడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది హత్యలు.. విత్ ఇన్ ది స్పాన్ అఫ్ ట్వంటీ మంత్స్.. ఇది అతగాడి క్రైం రికార్డు. ఎటువంటి ఆయుధం కూడా వాడకుండా కేవలం పూజలు, ప్రసాదంతో చంపే ఈ హంతకుడి క్రైమ్ థిల్లర్‌ని పోలీసులు గుట్టు రట్టు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు హునుమాన్‌నగర్, […]
నెత్తురు చుక్క చిండదు.. వంటిపై చిన్న గీత కూడా కనిపించదు.. డబ్బు కోసం సొంతవారిని సైతం హత్య చేసిన నర హంతకుడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది హత్యలు.. విత్ ఇన్ ది స్పాన్ అఫ్ ట్వంటీ మంత్స్.. ఇది అతగాడి క్రైం రికార్డు. ఎటువంటి ఆయుధం కూడా వాడకుండా కేవలం పూజలు, ప్రసాదంతో చంపే ఈ హంతకుడి క్రైమ్ థిల్లర్‌ని పోలీసులు గుట్టు రట్టు చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు హునుమాన్‌నగర్, ఎన్టీఆర్ కాలనీకి చెందిన వెల్లంకి సింహాద్రి అలియాస్ శివ.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. అందులో సరైన ఆదాయం రాకపోవటంతో ఈజీ మనీ కోసం అడ్డదారులు పట్టదు. రంగురాళ్ల, గుప్తనిధులు, రైస్ పుల్లింగ్ కాయిన్, బంగారం తేత్తింపు అవుతుందంటూ జనాల్ని నమ్మించటం.. అలా నమ్మిన వాళ్లకు సైనెడ్ పెట్టి చంపేయటం వృత్తిగా మార్చుకున్నాడు. ఇతడికి విజయవాడకు చెందిన బాబు అలియాస్ శంకర్ అనే వ్యక్తి సైనెడ్ అందించటంతో.. గత 20 నెలల్లో ఏకంగా పది హత్యలకు తెగబడ్డాడు శివ.
ఇలా ఇన్ని కిరాతకమైన హత్యలు చేసిన శివ.. ఇటీవల వట్లూరు ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటూ పీ.ఈ.టి.గా పని చేస్తున్న కాటి నాగరాజు హత్యతో వెలుగులోకి వచ్చాడు. నాగరాజు ఇంటి దగ్గర నుంచి లక్షా 90 వేల నగదు, బంగారంతో ఇంటి నుంచి బయటికి వెళ్లగా.. వట్లూరు పాలిటెక్నీక్ కాలేజీ వద్ద సృహ తప్పిపోయి కనబడ్డాడు. అతన్ని బంధువులు ఆసుపత్రికి తరలించినా.. ఫలితం లేకుండా పోయింది. నాగరాజు ఒంటిపై నగలు, క్యాష్ కనిపించకపోవడంతో అతని బంధువులు ఇది హత్యే అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. సీరియల్ కిల్లర్ సింహాద్రితో పాటు శంకర్‌ను కూడా అరెస్ట్ చేశారు.
డబ్బు మీద అమితమైన మోజు పెంచుకున్న సింహాద్రి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా జిల్లాలోని కొంతమంది అమాయకుల ప్రాణాలను పొట్టను పెట్టుకున్నట్లు ప్రాధమిక విచారణలో తేలింది. క్రైమ్ థ్రిల్లర్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా హత్యలు చేసిన ఈ కిరాతకుడు చివరికి కటకటాలపాలయ్యాడు.