Mirzapur: విద్యార్థి పట్ల ప్రిన్సిపల్‌ అమానుషం..అల్లరి చేశాడని బిల్డింగ్‌పై నుంచి వేలాడదీశాడు..

|

Oct 30, 2021 | 9:04 AM

విద్యార్థులు తప్పులు చేస్తే సర్ది చెప్పి వారిని సక్రమమైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత గురువులది..

Mirzapur: విద్యార్థి పట్ల ప్రిన్సిపల్‌ అమానుషం..అల్లరి చేశాడని బిల్డింగ్‌పై నుంచి వేలాడదీశాడు..
Follow us on

విద్యార్థులు తప్పులు చేస్తే సర్ది చెప్పి వారిని సక్రమమైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత గురువులది. అయితే ఈ విషయాన్ని మర్చిపోయి ఇటీవల కొందరు ఉపాధ్యాయులు స్టూడెంట్స్‌ పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. క్రమ’శిక్ష’ణ పేరుతో వారిని దారుణంగా హింసిస్తున్నారు. ప్రస్తుతం అలాంటి సంఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో చోటు చేసుకుంది. అల్లరి చేస్తున్నాడనే కారణంతో ఓ స్కూల్‌ ప్రిన్సిపల్‌ విద్యార్థిని స్కూల్‌ బిల్టింగ్‌
పైఅంతస్తు నుంచి తలకిందులుగా వేలాడదీశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. జిల్లా కలెక్టర్‌ దాకా ఈ ఫొటోలు చేరడంతో సదరు ప్రిన్సిపాల్‌ను పోలీసలు అరెస్ట్‌ చేశారు.

కలెక్టర్‌ ఆగ్రహం
పోలీసుల వివరాల మేరకు.. మీర్జాపూర్‌ అహ్రౌరా ప్రాంతంలోని సద్భావణ్‌ శిక్షణ్ హైస్కూల్‌లో మధ్యాహ్నం ఓ విద్యార్థి తోటి విద్యార్థితో గొడవపట్టాడు. దీనిపై ఆగ్రహించిన ఆ స్కూల్‌ ప్రిన్సిపల్‌ మనోజ్‌ విశ్వకర్మ విద్యార్థిని పాఠశాల బిల్డింగ్ అంతస్తు నుంచి కిందకు తలకిందులుగా వేలాడదీశాడు. దీంతో అతడు భయపడుతూ గట్టిగా కేకలు వేశాడు. తోటి విద్యార్థులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ వరకు చేరడంతో ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు పోలీసులు ప్రిన్సిపల్‌ను అరెస్ట్‌ చేశారు. విద్యార్థులు అల్లరి చేస్తే సర్ది చెప్పాలి కానీ…ఇలా దారుణంగా ప్రవర్తించడమేంటి? అని నెటిజన్లు స్కూల్‌ ప్రిన్సిపల్‌పై మండిపడుతున్నారు.

Also Read:

Crime News: భర్తకు వీడియో కాల్ చేసి భార్య అఘాయిత్యం.. ఇంటికి తీసుకెళ్లడం లేదని ఏం చేసిందంటే..?

Aryan Khan: షారుక్ ఖాన్‌కు మరోసారి నిరాశ.. కొడుకు ఆర్యన్ ఖాన్ మరోరాత్రి జైలులోనే..

Ganja Seized: భాగ్యనగరంలో 110 కిలోల గంజాయి పట్టివేత.. ఏవోబీ నుంచి అరటి లోడ్‌లో తరలిస్తుండగా..