
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్ పర్సనల్ అసిస్టెంట్ కార్యాలయానికి ఓ కాల్ వచ్చింది. రూ.10 లక్షల రుణం మంజూరు చేయాలని, లేదంటే ఎస్‌బీఐ చైర్మన్‌ను చంపేస్తామని, అలాగే ఎస్‌బీఐ కార్యాలయాన్ని పేల్చివేస్తామని ఓ దుండగుడి నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. నారిమాన్ పాయింట్ ప్రాంతంలోని ఎస్‌బీఐ చైర్మన్ పీఏ ఆఫీసుకు బుధవారం ఉదయం ఈ బెదిరింపు కాల్ వచ్చినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. ఈ బెదిరింపు కాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా, బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. పశ్చిమబెంగాల్ నుంచి ఈ బెదిరింపు కాల్ వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
నిందితుడిని పట్టుకునేందుకు ముంబై పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఫోన్ చేసిన వ్యక్తి తనను మహ్మద్ జియా ఉల్ అలీగా పరిచయం చేసుకున్నాడని, అతనికి రూ.10 లక్షల రుణం మంజూరు చేయాలని బ్యాంకు ఆఫీస్ అసిస్టెంట్ సెక్యూరిటీ మేనేజర్ అజయ్‌కుమార్ శ్రీవాస్తవ్ గురువారం ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
అయితే రుణం మంజూరు చేయకుంటే ఎస్‌బీఐ చైర్మన్‌ని కిడ్నాప్ చేసి హత్య చేస్తామని, బ్యాంకు కార్పొరేట్ కార్యాలయాన్ని బాంబుతో పేల్చివేస్తామని కాల్ చేసిన వ్యక్తి బెదిరించాడని అధికారి తెలిపారు. బెదిరింపు కాల్ తర్వాత, శ్రీవాసతవ్ దక్షిణ ముంబైలోని మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేశాడు. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 506 (2) (నేరపూరిత బెదిరింపు) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసుపై దర్యాప్తు ప్రారంభించి బెదిరింపు కాల్ చేసిన ఫోన్ నంబర్‌కు సంబంధించిన కాల్ రికార్డు వివరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ముంబై పోలీసుల బృందాన్ని పశ్చిమ బెంగాల్‌కు పంపినట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి