Accident: తిరుపతిలో జనంపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. మహిళ మృతి.. మరొకరికి తీవ్రగాయాలు..

|

Apr 25, 2021 | 8:15 AM

RTC Bus rams into people: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఆర్టీసీ బస్సు భీభత్సం సృష్టించింది. అదుపు తప్పి జనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ మహిళ

Accident: తిరుపతిలో జనంపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. మహిళ మృతి.. మరొకరికి తీవ్రగాయాలు..
Road Accident
Follow us on

RTC Bus rams into people: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఆర్టీసీ బస్సు భీభత్సం సృష్టించింది. అదుపు తప్పి జనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. తిరుపతిలోని సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ బస్సు రైల్వే స్టేషన్ నుంచి తిరుమలకు వెళ్తుండగా.. కర్నాల వీధి దగ్గర అదుపు తప్పి అకస్మాత్తుగా జనంపైకి దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

బస్సు బీభత్సానికి రెండు విద్యుత్ స్తంభాలు పడిపోగా.. నాలుగు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. అనంతరం బస్సు మరో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనతో స్థానికులతో పాటు బస్సులో ఉన్న వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బస్సులో ఉన్న వారికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణంగా పేర్కొంటున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

Corona effect: కరోనా కాటుకు మరో పూజారి బలి.. ఆరోగ్యం విషమించి బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం అర్చకుడు మృతి

Kerala Lockdown: ఉగ్రరూపం దాల్చుతున్న కరోనా.. కేరళలో కఠిన ఆంక్షలు.. రాష్ట్రవ్యాప్తంగా 48 గంటల పాటు లాక్‌డౌన్..