Renigunta Tirupati: తిరుపతిలోని రేణిగుంటలో ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం సృష్టించింది. హెడ్ కానిస్టేబుల్ ఆనందరావు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు రేణిగుంట అర్బన్ పోలీసులు తెలిపారు. ఆనందరావు రేణిగుంట రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బర్రాక్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా పలు వివరాలను తెలుసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ పోలీసులు వెల్లడించారు. హెడ్ కానిస్టేబుల్ ఆనందరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా చింతలపూరి గ్రామంగా పోలీసులు తెలిపారు. ఈ ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: