
Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అతివేగం, ఓవర్‌టెక్, మద్యం తాగి వాహనాలు నడపడం, నిర్లక్ష్యంగా నడపడం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ప్రతి రోజు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఓబులాయపల్లి శివారులో కారు-ఆటో ఢీకొడనంతో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎదురెదురుగా వస్తున్న కారు-ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే గాయపడిన వారు దేవరకద్ర ఎంపీడీవో కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బందిగా గుర్తించారు. అయితే ప్రమాదంలో ఎంపీడీవో అటెండర్ విజయరాణి, ఆటో డ్రైవర్ ఘటన స్థలంలో మృతి చెందగా, ఎంపీడీవో కార్యాలయ అసిస్టెంట్ జ్యోతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.’
ఇవి కూడా చదవండి: