Zookeeper Dies: నాలుగేళ్లుగా పాములకు పాలు పోసి పెంచాడు.. చివరకు కోబ్రా కాటుకే బలయ్యాడు.. జూ కీపర్ ఉదంతం..

|

Jul 02, 2021 | 9:14 AM

Thiruvananthapuram Zoo: పాములకు పాలు పోసిన వ్యక్తే.. చివరకు పాము కాటుకు గురై ప్రాణాలు విడిచాడు. గత నాలుగేళ్లుగా జూలో పనిచేస్తూ.. పాముల ఆలనా పాలనా చూసుంటున్న వ్యక్తే విషపూరిత

Zookeeper Dies: నాలుగేళ్లుగా పాములకు పాలు పోసి పెంచాడు.. చివరకు కోబ్రా కాటుకే బలయ్యాడు.. జూ కీపర్ ఉదంతం..
Zookeeper Dies King Cobra Bite
Follow us on

Thiruvananthapuram Zoo: పాములకు పాలు పోసిన వ్యక్తే.. చివరకు పాము కాటుకు గురై ప్రాణాలు విడిచాడు. గత నాలుగేళ్లుగా జూలో పనిచేస్తూ.. పాముల ఆలనా పాలనా చూసుంటున్న వ్యక్తే విషపూరిత కోబ్రా కాటుకు గురై మరణించాడు. ఈ విషాద సంఘటన తిరువనంతపురం జంతుప్రదర్శనశాలలో చోటుచేసుకుంది. విషపూరిత కోబ్రా కాటువేయడంతో.. జూ కీపర్ ఎ.ఎస్.హర్షద్ (45) గురువారం మధ్యాహ్నం మరణించినట్లు పోలీసులు తెలిపారు. కట్టకడ తాలుకాలోని.. అంబూరి పంచాయతీకి చెందిన హర్షద్.. నాలుగేళ్లుగా తిరువనంతపురం జూలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి పాముల సంరక్షణ బాధ్యతను అధికారులు అప్పగించారు. యథావిధిగా గురువారం మధ్యాహ్నం 12గంటల సమయంలో కోబ్రాలు ఉండే ప్రదేశం ఎన్‌‌క్లోజర్‌ను శుభ్రం చేస్తుండగా.. ఈ సంఘటన జరిగింది.

హర్షద్ మూడు కోబ్రాలు ఉన్న ప్రాంతాన్ని శుభ్రపరిచాడని.. ఈ క్రమంలో మూడు పాముల్లోని ఒక పాము హర్షద్ చేతిపై కాటు వేసినట్లు అధికారులు తెలిపారు. ఆ తరువాత కొంతసేపటికే హర్షద్ సృహతప్పి పడిపోయాడని.. వెంటనే తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు జూ అధికారి తెలిపారు. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారన్నారు. కాగా.. హర్షద్ ఇటీవలనే కోవిడ్ -19 నుంచి కోలుకున్నాడు.

అయితే.. హర్షద్ పాములు, జంతువుల మధ్యనే పెరిగాడని.. అతని కుటుంబం అనేక దశాబ్దాలుగా రాష్ట్రవ్యాప్తంగా సర్కస్‌లు నిర్వహిస్తూ.. కడుపునింపుకుంటుందని వెల్లడించారు. హర్షద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హర్షద్ కుటుంబాన్ని ఆదుకుంటామని జూ అధికారులు వెల్లడించారు.

Also Read:

Corona: కోరుకున్న ఉద్యోగాన్ని సాధించి గెలిచాడు.. కానీ కరోనా చేతిలో ఓడిపోయాడు. కన్నీరు పెట్టిస్తోన్న అవినాష్‌ కథ.

Covid-19 Vaccination: దేశంలో ముమ్మరంగా కోవిడ్ వ్యాక్సినేషన్.. 34 కోట్లకు చేరువలో టీకాల పంపిణీ..