Road Accident: నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ ఓ నిండు ప్రాణం తీసింది.. చావు బతుకుల మధ్య మరో వ్యక్తి

నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ ఓ నిండు ప్రాణం తీసింది. మరో వ్యక్తిని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడేలా చేసింది. ప్రమాదం జరిగిన తర్వాత కారు డ్రైవర్ కారును వదిలి పారిపోయాడు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని వెతికి మరీ పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు..ఎల్బీ నగర్‌లో జరిగింది ఈ దారుణం

Road Accident: నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ ఓ నిండు ప్రాణం తీసింది.. చావు బతుకుల మధ్య మరో వ్యక్తి
Ci Sadiq Ali Dies In Road Accident

Edited By:

Updated on: Feb 14, 2024 | 4:52 PM

నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ ఓ నిండు ప్రాణం తీసింది. మరో వ్యక్తిని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడేలా చేసింది. ప్రమాదం జరిగిన తర్వాత కారు డ్రైవర్ కారును వదిలి పారిపోయాడు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని వెతికి మరీ పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు..ఎల్బీ నగర్‌లో జరిగింది ఈ దారుణం

ఎల్బీనగర్‌లో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు యూ టర్న్‌ చేస్తుండగా రాంగ్‌ రూట్‌లో వెళ్తున్న బైక్‌ ఒక్కసారిగా కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు చార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ సాదిక్ అలీగా, గాయపడిన వ్యక్తి నారాయణగూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఎస్ ఖాజావలీ మొహినుద్దీన్‌గా గుర్తించారు. సాదిక్ అలీ ఘటనా స్థలంలో ప్రాణాలు కోల్పోగా, మొహినుద్దీన్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సీఐ సాధిక్ అలీ, ఎస్సై మొహినుద్దీన్‌ మలక్‌పేట్‌లోని ప్రభుత్వ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. సీఐ సాధిక్ అలీ రెండు రోజుల క్రితం చార్మినార్ ఎక్సైజ్ కార్యాలయం నుంచి మెదక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి బదిలీ అయ్యారు. ఒకటి రెండు రోజుల్లో విధుల్లో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే ఎల్బీనగర్‌లో ఏర్పాటు చేసిన ఓ ఫంక్షన్‌కి వెళ్లి మలక్‌పేట్‌లోని క్వార్టర్స్‌కు వెళుతుండడగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

ప్రమాదం జరిగిన తర్వాత కారులో ఉన్న డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు స్పాట్ చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సాదిక్ అలీ ప్రాణాలు కోల్పోయారని వైద్యులు తెలిపారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ కారుపై స్పీడ్ డ్రైవింగ్ చేసినట్లు పెండింగ్ చలానాలు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు అల్వాల్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం కారు నడిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై హిట్ అండ్ రన్ కేసుతో పాటు ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ కింద కేసు నమోదు చేశారు.

ఎక్సైజ్ సీఐ మహమ్మద్ సాదిక్ అలీ అకాల మ‌ర‌ణం ప‌ట్ల ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు సంతాపం వ్య‌క్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సాదిక్ అలీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…