Hyderabad: హైదరాబాద్‌ మాదాపూర్‌లో కాల్పుల కలకలం.. ప్రముఖ నిర్మాత అనుచరులపై దాడికి యత్నం..

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో గురువారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. సంజీవర రెడ్డి అనే వ్యక్తి తుపాకీతో కాల్పులు జరుపుతూ భయబ్రాంతులకు గురి చేశాడు. మాదాపూర్ ఖానామేట్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. టాలీవుడ్‌ ఇండస్ట్రీలోని ఓ పముఖ నిర్మాతకు..

Hyderabad: హైదరాబాద్‌ మాదాపూర్‌లో కాల్పుల కలకలం.. ప్రముఖ నిర్మాత అనుచరులపై దాడికి యత్నం..
Representative Image

Updated on: Oct 21, 2022 | 12:38 AM

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో గురువారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. సంజీవర రెడ్డి అనే వ్యక్తి తుపాకీతో కాల్పులు జరుపుతూ భయబ్రాంతులకు గురి చేశాడు. మాదాపూర్ ఖానామేట్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. టాలీవుడ్‌ ఇండస్ట్రీలోని ఓ పముఖ నిర్మాతకు చెందిన స్థలాన్ని ఆక్రమించేందుకు కొందరు యత్నించారు. దీంతో అడ్డుకోవడానికి వచ్చిన నిర్మాత అనుచరలుపై సంజీవ్‌ రెడ్డి కాల్పులు జరిపాడు. సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సంజీవ్‌ రెడ్డిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదిలా ఉంటే 500 గజాల భూవివాదంలో సంజీవ రెడ్డి గన్నుతో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. సంజీవరెడ్డి పై గతంలోనే అనేక భూకబ్జా ఆరోపణలు ఉన్నాయని, తుపాకీ సంజీవరెడ్డిగా పేరున్న ఇతన్ని కడప జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. సంజీవరెడ్డి దగ్గరున్న వెపన్ లైసెన్స్‌ వెపన్‌గా పోలీసులు గుర్తించారు. ఈ గన్‌ను సంజీవ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల నుంచి గన్‌ లైసెన్స్‌ పొందినట్లు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..