Telangana: రియల్టర్ కిడ్నాప్.. సినిమా స్టైల్లో దుండగులను ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు

సినీఫక్కీలో ఓ రియల్టర్‌ కిడ్నాప్‌ జరిగింది. ఈ ఉదయాన్నే నిర్మల్‌జిల్లా కేంద్రంలోని దివ్యనగర్‌ తన్వి అపార్ట్‌మెంట్‌లో...

Telangana: రియల్టర్ కిడ్నాప్.. సినిమా స్టైల్లో దుండగులను ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు
Kidnap
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 08, 2021 | 11:10 AM

సినీఫక్కీలో ఓ రియల్టర్‌ కిడ్నాప్‌ జరిగింది. ఈ ఉదయాన్నే నిర్మల్‌జిల్లా కేంద్రంలోని దివ్యనగర్‌ తన్వి అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న రియల్టర్‌ విజయ్‌ దేశ్‌పాండేను గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్‌ చేశారు. కొందరు వ్యక్తులు విజయ్‌దేశ్‌పాండేను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు సిసిటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. లిఫ్టులోంచి బయటకు వస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కిడ్నాపైన విషయాన్ని వెంటనే పోలీసులకు చెప్పారు విజయ్‌దేశ్‌పాండే కుటుంబసభ్యులు. అలెర్టయిన పోలీసులు రెండు వాహనాలు తూఫ్రాన్‌ వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. వెంటనే రెండు బృందాలు వెంబడించి కిడ్నాపర్లను తూఫ్రాన్‌ దగ్గర పట్టుకున్నారు. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. రియల్టర్‌ విజయ్‌ దేశ్‌పాండే క్షేమంగా ఉన్నట్లు కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. రియల్టర్‌ లావాదేవీలు, భూముల కొనుగోలు వ్యవహారమే కిడ్నాప్‌కు కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. రియల్టర్‌ విజయ్‌ దేశ్‌పాండే సంగారెడ్డిలో రెండు నెలల క్రితం 2 కోట్ల విలువ చేసే భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమి లావాదేవీల విషయంలో వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలోనే కిడ్నాప్‌కు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. స్థానికంగా ఈ కిడ్నాప్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది.

Also Read: ఉదయం థియేటర్లలో రిలీజ్.. మ్యాట్నీకే ‘SR కళ్యాణమండపం’ పైరసీ రెడీ..

ఎరక్కపోయి వెళ్లాడు.. ఏటీఎంలో ఇరుక్కుపోయాడు.. ఈ సీన్ చూస్తే నవ్వు ఆపుకోలేరు

పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..
ఈ సంక్రాంతికి కలర్ ఫుల్ ముగ్గుల డిజైన్స్ మీకోసం..
ఈ సంక్రాంతికి కలర్ ఫుల్ ముగ్గుల డిజైన్స్ మీకోసం..
రోజూ సమాధులకు నీళ్లు పోస్తున్నాడు.. పిచ్చోడు అనుకునేరు..
రోజూ సమాధులకు నీళ్లు పోస్తున్నాడు.. పిచ్చోడు అనుకునేరు..
ముంబై కెప్టెన్‌గా హార్దిక్ ఔట్.. తొలి మ్యాచ్‌లో సారథిగా ఎవరంటే?
ముంబై కెప్టెన్‌గా హార్దిక్ ఔట్.. తొలి మ్యాచ్‌లో సారథిగా ఎవరంటే?
విజయ్ దళపతితో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. ?
విజయ్ దళపతితో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. ?
ఫార్మా GCCలకు కేంద్రబిందువుగా హైదరాబద్.. 25 లక్షల కొత్త ఉద్యోగాలు
ఫార్మా GCCలకు కేంద్రబిందువుగా హైదరాబద్.. 25 లక్షల కొత్త ఉద్యోగాలు
ఇదెక్కడి అన్యాయం బ్రో.. ఆ ముగ్గురికి మాత్రం మరోసారి మొండిచేయి
ఇదెక్కడి అన్యాయం బ్రో.. ఆ ముగ్గురికి మాత్రం మరోసారి మొండిచేయి
సంక్రాంతికి ఊరెళుతున్నారా...? అయితే ఈ అలర్ట్ మీకోసమే!
సంక్రాంతికి ఊరెళుతున్నారా...? అయితే ఈ అలర్ట్ మీకోసమే!