Bluetooth Earphone: దేశంలోనే తొలి కేసు.. యువకుడి ప్రాణాలు తీసిన బ్లూటూత్ ఇయర్ ఫోన్స్.. ఎక్కడ జరిగిందంటే..

|

Aug 07, 2021 | 7:35 AM

Bluetooth Earphone: రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బ్లూటూత్ హెడ్‌ఫోన్ పేలి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

Bluetooth Earphone: దేశంలోనే తొలి కేసు.. యువకుడి ప్రాణాలు తీసిన బ్లూటూత్ ఇయర్ ఫోన్స్.. ఎక్కడ జరిగిందంటే..
Bluetooth
Follow us on

Bluetooth Earphone: రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బ్లూటూత్ హెడ్‌ఫోన్ పేలి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వెర్‌లెస్ గ్యాడ్జెట్ అయిన బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ ఒక్కసారిగా పేలిపోవడంతో యువకుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. చనిపోయిన యువకుడు జైపూర్‌లోని చౌము ప్రాంతంలోని ఉదైపురియా గ్రామానికి చెందిన రాకేశ్ నగర్‌గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులు తెలిపిన వివరాలు ఉన్నాయి. ఉదైపురియా గ్రామానికి చెందిన రాకేశ్.. బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్‌ని చెవిలో పెట్టుకుని ఫోన్‌ కాల్ మాట్లాడుతున్నాడు.

ఇంతలో అకస్మాత్తుగా ఆ బ్లూట్ ఇయర్‌ఫోన్స్‌ పేలింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాకేశ్.. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇక పేలుడు ధాటికి యువకుడి రెండు చెవులకు తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా, అపస్మారకస్థితిలో పడిపోయిన రాకేశ్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతనికి చికిత్స అందిస్తుండగా.. హార్ట్ స్ట్రోక్ వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ పేలి ఒక వ్యక్తి చనిపోవడం దేశంలోనే ఇది తొలి కేసు అని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

JEE Main Result 2021 Session 3: జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల.. మీ రిజల్ట్స్‌ను ఇక్కడ చెక్ చేసుకోండి..

Simhachalam Lands Issue: సింహాచలం భూ అక్రమాలపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్‌

HDFC Fire: లక్సెట్టిపేట హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో అగ్నిప్రమాదం.. మంటల్లో పూర్తిగా తగలబడిన బ్యాంకు, భారీగా ఆస్తినష్టం