Terrorists Encounter: భారత్‌లో భారీగా విధ్వంసం సృష్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ముష్కరమూకలకు భద్రతా బలగాలు గట్టిగా సమాధానమిస్తున్నాయి. కొన్ని రోజుల నుంచి జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోన్న విషయం తెలిసిందే. తాజాగా భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా టౌన్‌లో బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వారిలో పాకిస్తాన్ లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది ఐజాజ్ అలియాస్ అబు హురైరాతోపాటు మరొకరిని హతమార్చినట్లు కాశ్మీర్ ఐజీపీ తెలిపారు.
పుల్వామాలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో బుధవారం తెల్లవారుజామున కశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ సందర్భంగా బలగాలపై ముష్కరులు కాల్పులు జరిపారని కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా వారిని లొంగిపోవాలని కోరామని అయినప్పటికీ వినకుండా భద్రతా దళాలపై కాల్పులు జరిపారని వెల్లడించారు. అనంతరం బలగాలు ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. కాగా కాల్పుల్లో హతమైన మరో ఉగ్రవాదిని గుర్తించాల్సి ఉంది.
ఇదిలాఉంటే.. తాజాగా మరోసారి జమ్ముకాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దు వెంట బుధవారం ఉదయం ఓ డ్రోన్ కలకలం సృష్టించింది. అర్నియా సెక్టార్‌లో డ్రోన్‌ను గుర్తించిన భద్రతా బలగాలు అప్రమత్తమయ్యారు. డ్రోన్ తెల్లవారుజామున పాక్ నుంచి భారత్‌వైపు వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా అలర్టైన భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. బుధవారం తెల్లవారుజామున 5.25 గంటల ప్రాంతంలో పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన డ్రోన్.. సరిహద్దులు దాటడానికి ప్రయత్నించిందని, కాల్పులు జరపడంతో వెనక్కి వెళ్లినట్లు సైన్యం వెల్లడించింది. అయితే.. కొన్ని రోజుల నుంచి ఉగ్రవాదులు డ్రోన్ ద్వారా రెక్కీ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
Encounter breaks out at Pulwama town of South Kashmir. Police and security forces are on the job. Details awaited: Jammu & Kashmir Police
— ANI (@ANI) July 13, 2021
Also Read: