Pudding and Mink Pub Drugs Case: పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో పోలీసులు విచారణలో భాగంగా తవ్వేకొద్ది సంచలనలు బయటపడుతున్నాయి. పబ్ ఓనర్ అభిషేక్(Abhishek) ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. టాలీవుడ్ ప్రముఖులతో అభిషేక్ చేసిన వాట్సాప్ చాట్‌ను గుర్తించారు పోలీసులు. Stuff – Mat పేరుతో వాట్సాప్ చాట్ చేసినట్లు ఐడెంటిఫై చేశారు. వాట్సాప్ చాట్‌లో సంచలన సంగతులు ఉన్నట్లు తెలుస్తోంది. అభిషేక్ సెలబ్రెటీ నెట్‌వర్క్ చూసి పోలీసులే షాక్‌కు గురవుతున్నారు. అభిషేక్ కాంటాక్ట్ లిస్ట్‌లో సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు బ్యూరోక్రాట్లు కూడా ఉండటం షాక్‌కి గురిచేస్తోంది. అభిషేక్ డీలింగ్స్, నెట్‌వర్క్ ఏ రేంజ్‌లో ఉందో తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు పోలీసులు.
వాట్సాప్‌లో 70 గ్రూపులకు అడ్మిన్.. 152 వాట్సాప్ గ్రూపుల్లో రెగ్యులర్ చాటింగ్.. సభ్యుల కేటగిరీల వారీగా వాట్సాప్ గ్రూపులు.. ఇదీ అభిషేక్ డీలింగ్ నెట్‌వర్క్.
డ్రగ్ పార్టీల కోసం ప్రత్యేక యాప్ క్రియేట్ చేశారు. Stuff – Mat పేరుతో వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపేవారు. పార్టీలో ఎవరికి పడితే వాళ్లకు ఎంట్రీ ఉండదు. పార్టీ స్థాయిని బట్టి.. వ్యక్తి హోదాను బట్టి ఇన్విటేషన్ ఉంటుంది. ఈ మొత్తం కమ్యూనికేషన్‌లో కోడ్ లాంగ్వేజ్ వాడుతూ రెగ్యులర్‌గా పార్టీలు నిర్వహించడమే అభిషేక్ చేతివాటం. పుడింగ్ అండ్ మింక్ పబ్‌పై పోలీసుల దాడి జరిగిన రోజు 8 గ్రూపులకు మెసేజ్‌లు వెళ్లాయి. ఆరోజు మొత్తం 250 మంది పబ్‌కి వచ్చారు. కానీ పోలీసులు రెయిడ్ చేసే సమయానికి 145 మందే ఉన్నారు. ఈ మొత్తం లిస్ట్‌లో డ్రగ్స్ ఎంత మంది తీసుకున్నారు?వాళ్లు ఎవరెవరు అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.
గతంలో గోవాలోని పబ్‌ల్లో పార్టీలు నిర్వహించిన అభిషేక్.. ఆ తర్వాత ఫుడింగ్ అండ్ మింక్‌ను లీజుకు తీసుకున్నాడు. 152 వాట్సాప్ గ్రూపుల్లో అభిషేక్ రెగ్యులర్ చాటింగ్ చేస్తూ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తారు. పార్టీ అవగానే చాట్ మొత్తం డిలీట్ చేస్తారు. దీంతో మెసేజ్‌లను రిట్రివ్ చేయడానికి ఎథికల్ హ్యాకర్ల సహాయం తీసుకుంటున్నారు అధికారులు. మూడు టేబుళ్ల మీద సేకరించిన వస్తువులపై డ్రగ్స్ ఆనవాళ్లు గుర్తించారు. ఆ మూడు టేబుళ్లపై ఎవరెవరు కూర్చున్నారు? ఎంత మంది డ్రగ్స్ వాడారు? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.