Proddatur Triple Murder: మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి కన్నతల్లి, తోడ బుట్టినవాళ్లను అతి కిరాతకంగా అంతమోందించాడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో దారుణం జరిగింది. కన్నతల్లితోపాటు తోబుట్టువులను హతమార్చాడు ఓ కిరాతకుడు. ప్రొద్దుటూరులోని హైదర్ ఖాన్ వీధికి చెందిన కరీముల్లా అనే వ్యక్తి తల్లి, చెల్లి, తమ్ముడిని కిరాతకంగా చంపేశాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. హంతకుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతిచెందిన వారిని గుల్జార్ బేగం(50), కరీమున్నీసా (21), మహమ్మద్ రఫి (25)గా పోలీసులు గుర్తించారు. ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలతోనే వారిని హత్య చేసినట్లు తెలుస్తోంది. కరిముళ్ల ప్రవర్తన కొద్దిరోజులుగా సరిగ్గా లేదని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also.. అంబులెన్స్ లభించక, కారు రూఫ్ కి తండ్రి డెడ్ బాడీని కట్టి, ఆగ్రాలో ఓ వ్యక్తి దుస్థితి