Private Teachers : ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతోన్న ప్రయివేటు టీచర్లు.. యాదాద్రి జిల్లాలో ఉసురు తీసుకున్న మాస్టారు

Private Teacher suicide : కరోనా మహమ్మారి పుణ్యమాని ప్రైవేట్ టీచర్ల బ్రతుకులు ఛిద్రమైపోతున్నాయి.

Private Teachers : ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతోన్న ప్రయివేటు టీచర్లు..  యాదాద్రి జిల్లాలో ఉసురు తీసుకున్న మాస్టారు
Private Teacher Suicide

Updated on: May 20, 2021 | 10:31 AM

Private Teacher suicide : కరోనా మహమ్మారి పుణ్యమాని ప్రైవేట్ టీచర్ల బ్రతుకులు ఛిద్రమైపోతున్నాయి. ఉపాధి కోల్పోయి, జీతాల్లేక బ్రతుకు బండిని ఎలా నెట్టుకురావాలో తెలీక ప్రయివేటు ఉపాధ్యాయులు సతమతమైపోతున్నారు. ఉపాధి కోల్పోయి కలత చెందిన ఒక ప్రయివేటు ఉపాధ్యాయుడు ఇవాళ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెలంగాణ యాదాద్రి జిల్లా వలిగొండ మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన 30 ఏళ్ల మామిడి రవివర్మరెడ్డి ఈ దారుణానికి ఒడిగట్టారు. హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న రవివర్మరెడ్డి కొంతకాలంగా పాఠశాలలు మూతపడ్డంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చిన ఆయన, తన ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. రవికి భార్య, కుమారుడు ఉన్నారు. ఇలా ఉండగా, టీవీ9 ప్రయివేటు ఉపాధ్యాయుల వెతల్ని ఇప్పటికే ఎన్నోసార్లు పలు కథనాల రూపంలో ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ల కష్టకాలంలో ఒకవైపు భారీగా పెరిగిపోయిన నిత్యావసరాల ధరలు, మరోవైపు లేని ఉద్యోగాలతో నానా యాతన పడుతున్న ప్రయివేటు టీచర్ల అవస్థల్ని టీవీ9 ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లింది.

వీటిని దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ సర్కారు ప్రైవేట్ టీచర్లను ఆదుకునేందుకు నడుంబిగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది ప్రయివేటు టీచర్లకు సాయం అందించగా, పెండింగ్‌లో ఉన్న ప్రైవేట్ టీచర్ల‌కు రూ.2 వేల ఆర్థిక సహాయం వారి వారి అకౌంట్స్ లో మొన్న మంగళవారం డిపాజిట్ చేసింది తెలంగాణ విద్యా శాఖ. మొత్తం 79 వేల మంది అకౌంట్స్ లో డబ్బులు జ‌మ‌ చేశారు. ఇప్ప‌టికే 1.25 ల‌క్ష‌ల మంది ప్రైవేట్ స్కూల్స్ సిబ్బందికి ఆర్థిక‌సాయాన్ని కేసీఆర్ సర్కారు అందించింది.

Read also :  అరటిపళ్ల అమ్మకం.. హోటళ్లలో పని, ఇంకొందరు చెరుకు రసం బళ్లు.. ఉపాధిహామీ పనులు, ప్రైవేట్ టీచర్ల బ్రతుకులు ఆగమాగం