మెడికో ప్రీతి మృతి కేసు అనూహ్యంగా కొత్త మలుపు తిరిగింది. ఇన్నాళ్లూ తమ కూతురిని సైఫే చంపాడని చెబుతూ వచ్చిన ప్రీతి పేరెంట్స్.. సడన్‌గా యూటర్న్ తీసుకున్నారు. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత.. ఇది ఆత్మహత్యేనని పోలీసులు తేల్చేశారు. కానీ.. పోలీసులు సరిగా దర్యాప్తు చెయ్యలేదని, తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఇవాళ్టి ఉదయం వరకూ గట్టిగా వాదించారు ప్రీతి పేరెంట్స్.
కానీ.. వరంగల్ సీపీ రంగనాథ్‌ని కలిసిన తర్వాత పూర్తిగా చల్లబడ్డారు. ప్రీతి తండ్రి నరేందర్. తమకున్న అన్ని డౌట్ల మీద క్లారిటీ వచ్చిందని, సీపీ చేస్తున్న విచారణ మీద నమ్మకం ఏర్పడిందని, తమ కూతురిది ఆత్మహత్యేనని నమ్ముతున్నామని మీడియా ఎదుట ఒప్పేసుకున్నారు ప్రీతి తండ్రి. కమిషనర్‌ని కలవగానే తమ ఆరోపణలన్నింటినీ వెనక్కు తీసుకున్న ప్రీతి పేరెంట్స్.. కేసును మరో మలుపు తిప్పేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి