Pilot Passenger: విమానం గాలిలో ఉండగా.. ప్రయాణికుడిని దింపేసి వెళ్లిపోయిన ఫైలట్.
ఇటీవల కొందరు ప్రయాణికులు విమానాల్లో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారు. ఓ ప్యాసింజర్ తప్పతాగి తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర దుమారం లేపింది.
ఇటీవల కొందరు ప్రయాణికులు విమానాల్లో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారు. ఓ ప్యాసింజర్ తప్పతాగి తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర దుమారం లేపింది. మరో ఘటనలో ఓ ప్యాసింజర్ విమానంలోనే స్మోక్ చేసి హల్ చల్ చేశాడు. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో అనుహ్య ఘటన చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉండగా సిబ్బందితో గొడవకు దిగాడు ఓ ప్రయాణికుడు. ఏకంగా ఘర్షణకే దిగాడు. దీంతో వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించాడు పైలట్. తిరిగి ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశాడు. అనంతరం సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి, ప్రయాణానికి అంతరాయం కల్గించిన సదరు ప్యాసింజర్‌ను కిందకు దింపేశారు. అతనిపై ఫిర్యాదు చేసి విమానాశ్రయంలోని పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత విమానం మళ్లీ లండన్ బయల్దేరి వెళ్లింది. అయితే ఈ ఘటనకు సంబంధించి వివరాలను చెప్పేందుకు మాత్రం ఎయిర్ ఇండియా నిర్వాహకులు నిరాకరించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..