అతడి ఇంటికి ఎవరూ వచ్చినట్లు లేదు. కానీ ఇంట్లోని గోల్డ్, వెండి మిస్ అవుతున్నాయి. ఇలా ఒకసారి కాదు.. రెండు సార్లు జరిగింది. దీంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి.. దర్యాప్తు జరపడంతో ఆ ఇంటి ఇల్లాలు భాగోతం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా కారేపల్లికి చెందిన శివప్రకాశ్ అనే వ్యక్తి .. ఈనెల 5న తన ఇంట్లో దొంగతనం జరిగిందని.. 40 తులాల బంగారం చోరీకి గురైందని పోలీసులకు కంప్లైంట్ చేశాడు. తిరిగి ఈనెల 20న మరో 1,330 గ్రాముల బంగారం, రెండు కిలోల వెండి కనిపించడం లేదని మరోమారు అదే పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో సీసీఎస్ పోలీసులను రంగంలోకి దించారు పోలీస్ బాస్‌లు. సెల్‌ఫోన్ సిగ్నల్స్, సీసీ విజువల్స్ ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు శివప్రకాశ్ భార్య, గుంటూరుకు చెందిన బత్తుల వెంకట కృష్ణప్రసాద్‌లు నిందితులుగా గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు.
శివప్రకాశ్ గుంటూరుకు చెందిన అర్చనను 2008లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం. కారేపల్లిలో నివాసం ఉంటున్నారు. గొడవల కారణంగా అర్చన గతేడాది భర్త నుంచి విడిపోయి.. గుంటూరులో నివాసం ఉంటోంది. ఈ క్రమంలోనే గుంటూరుకు చెందిన బత్తుల వెంకట కృష్ణప్రసాద్‌తో అక్రమ సంబంధం ఏర్పడింది. ఇదిలా ఉండగా.. నెల రోజుల క్రితం భర్త శివప్రకాశ్ తల్లి మరణించడంతో అర్చన కారేపల్లికి వచ్చింది. అప్పటి నుంచి అక్కడే ఉంటుంది. ఈ క్రమంలోనే మే 3వ తేదీ రాత్రి వెంకట కృష్ణప్రసాద్‌ను ఇంటికి పిలిపించి బంగారం, వెండి ఇచ్చి రహస్యంగా పంపించేసింది. చోరీ జరిగిన విషయాన్ని 5వ తేదీన గుర్తించిన శివప్రకాశ్.. పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని.. నిందితులను రిమాండ్‌కు తరలించారు.
Also Read: తెలంగాణ ఓపెన్ స్కూల్ ఫీజు చెల్లింపు చివరి తేదీ పొడగింపు.. ఎప్పటి వరకంటే..