AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాలుగు రాష్ట్రాల్లో 80కి పైగా కేసులు.. మూడేళ్లుగా పరారీలో ఉన్న గజదొంగకు రిమాండ్‌

గచ్చిబౌలిలోని ప్రిజం పబ్బులో పోలీసుల మీద కాల్పులు జరిపిన నిందితుడు బత్తుల ప్రభాకర్‌ నేరచరిత్ర చూసి పోలీసులు విస్తుపోతున్నారు. 2022 మార్చిలో విశాఖ జైలు నుంచి పరారైన అతనిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మొత్తం 80 చోరీ కేసులు ఉన్నట్లు గుర్తించారు. అందులోనూ.. కేవలం 11 చోరీల్లోనే రెండున్నర కోట్లు కొట్టేశాడు. ఈ డబ్బులతో ఖరీదైన కార్లు కొంటూ.. పబ్బుల్లో గడుపుతూ ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఇలా మూడేళ్లుగా పోలీసులకు

నాలుగు రాష్ట్రాల్లో 80కి పైగా కేసులు.. మూడేళ్లుగా పరారీలో ఉన్న గజదొంగకు రిమాండ్‌
Bathula Prabhaker
K Sammaiah
|

Updated on: Feb 03, 2025 | 1:21 PM

Share

గచ్చిబౌలిలోని ప్రిజం పబ్బులో పోలీసుల మీద కాల్పులు జరిపిన నిందితుడు బత్తుల ప్రభాకర్‌ నేరచరిత్ర చూసి పోలీసులు విస్తుపోతున్నారు. 2022 మార్చిలో విశాఖ జైలు నుంచి పరారైన అతనిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మొత్తం 80 చోరీ కేసులు ఉన్నట్లు గుర్తించారు. అందులోనూ.. కేవలం 11 చోరీల్లోనే రెండున్నర కోట్లు కొట్టేశాడు. ఈ డబ్బులతో ఖరీదైన కార్లు కొంటూ.. పబ్బుల్లో గడుపుతూ ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఇలా మూడేళ్లుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. కానీ.. బ్యాడ్‌ లక్‌.. రెండు రోజులు గచ్చిబౌలి ప్రిజమ్‌ పబ్‌ దగ్గర పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు.

బత్తుల ప్రభాకర్‌ను అరెస్ట్‌ చేసిన హైదరాబాద్‌ పోలీసులు.. 14 రోజుల కోర్టు రిమాండ్‌తో జైలుకు తరలించారు. అయితే.. బత్తుల ప్రభాకర్‌ కేసు విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభాకర్‌ ఛాతిపైనున్న టాటూ ఆధారంగా కీలక విషయాలు ఛేధించారు. ఇంజనీరింగ్ కాలేజీలే టార్గెట్‌గా ప్రభాకర్‌ చోరీలకు పాల్పడ్డాడు. సుమారు రెండున్నర కోట్ల రూపాయల వరకు కాజేశాడు. మూడు కోట్ల రూపాయలు చోరీ చేసేందుకు టార్గెట్‌ పెట్టుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

బత్తుల ప్రభాకర్‌ కేసులో మరో సంచలన కోణమూ బయటపడింది. తొమ్మిది పేర్లు మార్చుకొని కొట్టేసిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడుపుతున్న ప్రభాకర్‌.. వందమంది అమ్మాయిలను ట్రాప్ చేసేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. చోరీల విషయంలో ఎవరైనా అడ్డొస్తే కాల్పులు జరిపేందుకు హైదరాబాద్ శివారులో షూటింగ్ ప్రాక్టీస్ చేశాడు. తన టార్గెట్స్‌ అన్నింటినీ సినిమా లెవెల్లో బోర్డుపై స్క్రిప్ట్‌ రాసుకుని మరీ ప్లాన్‌లు అమలు చేస్తున్నట్లు తేల్చారు.

Follow Us
కలర్స్, స్పెషల్‌ ఎడిషన్‌లో ఆకట్టుకుంటున్న జావా బాబర్​ బైక్
కలర్స్, స్పెషల్‌ ఎడిషన్‌లో ఆకట్టుకుంటున్న జావా బాబర్​ బైక్
'రూ.25 కోట్ల ఆస్తి కోసం.. కొబ్బరి నీళ్లలో సైనైడ్‌ కలిపి ఇచ్చా..'
'రూ.25 కోట్ల ఆస్తి కోసం.. కొబ్బరి నీళ్లలో సైనైడ్‌ కలిపి ఇచ్చా..'
రోహిత్ పై త్రిగుణ్ సంచలన కామెంట్స్.. స్టెరాయిడ్స్ బాడీ అంటూ కామెం
రోహిత్ పై త్రిగుణ్ సంచలన కామెంట్స్.. స్టెరాయిడ్స్ బాడీ అంటూ కామెం
భారీ బ్యాటరీతో మార్కెట్‌లోకి కైనెటిక్​ ఈవీ.. వివరాలివే
భారీ బ్యాటరీతో మార్కెట్‌లోకి కైనెటిక్​ ఈవీ.. వివరాలివే
మేకప్‌ బాక్స్‌ అనే డౌట్‌ వచ్చే రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్‌
మేకప్‌ బాక్స్‌ అనే డౌట్‌ వచ్చే రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్‌
వీరి కోసం చక్రం తిప్పబోతున్న భారీ గ్రహం.. ఆర్థికంగా తిరుగులేదు
వీరి కోసం చక్రం తిప్పబోతున్న భారీ గ్రహం.. ఆర్థికంగా తిరుగులేదు
IND vs AFG: భారత్‌-అఫ్గానిస్థాన్ తొలి టీ20పై క్లారిటీ..?
IND vs AFG: భారత్‌-అఫ్గానిస్థాన్ తొలి టీ20పై క్లారిటీ..?
తిరుమల వెళ్లేవారికి టీటీడీ అలర్ట్.. ఆ దర్శనాలు రద్దు
తిరుమల వెళ్లేవారికి టీటీడీ అలర్ట్.. ఆ దర్శనాలు రద్దు
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన 260 కోట్ల బ్లాక్ బస్టర్..తెలుగులోనూ ఉంది
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన 260 కోట్ల బ్లాక్ బస్టర్..తెలుగులోనూ ఉంది
బంగాళాఖాతంలో అల్పపీడనం..ఈ జిల్లాల్లో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం..ఈ జిల్లాల్లో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు